మురిసేలా మిరియం | - | Sakshi
Sakshi News home page

మురిసేలా మిరియం

Published Wed, Feb 19 2025 1:39 AM | Last Updated on Wed, Feb 19 2025 1:35 AM

మురిస

మురిసేలా మిరియం

● విరగ్గాసిన కాపు ● సేకరణలో రైతులు బిజీబిజీ ● కాఫీతోటల్లో అంతరపంటగా సాగు ● 1.10లక్షల ఎకరాల్లో మిరియాల పాదులు ● గత ఏడాది 11వేల టన్నుల వ్యాపారం ● ఎకరానికి రూ.60వేల ఆదాయం

సాక్షి,పాడేరు: జిల్లాలో కాఫీ తోటల్లో అంతరపంటగా గిరిజన రైతులు సాగుచేస్తున్న మిరియాల పంట విరగ్గాసింది. పాదులకు అఽధికంగా మిరియాల కాపు ఉండడంతో గిరిజన రైతులు మురిసిపోతున్నారు.నాణ్యతలో నంబర్‌–1గా జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న మన్యం మిరియాలు ఈఏడాది కూడా గిరిజన రైతులకు అధిక లాభాలు అందించనున్నాయి. కేరళ,కర్నాటక,తమిళనాడు,ఒడిశా రాష్ట్రాలలో మిరియాల పంట ఉన్నప్పటికీ అల్లూరి జిల్లాలో గిరిజనులు సేంద్రియ పద్ధతిలో సాగుచేస్తున్న మిరియాలే నాణ్యతలో నంబర్‌ వన్‌గా నిలుస్తున్నాయి. ఘాటు అధికంగా ఉండే మన్యం మిరియాలకు జాతీయ మార్కెట్‌లో మంచి ఆదరణ ఉంది. గత ఏడాది కిలో రూ.600 నుంచి రూ.700ధరతో వ్యాపారులు కొనుగోలు చేశారు.

1.10లక్షల ఎకరాల్లో సాగు

జిల్లాలో 1.48 లక్షల ఎకరాల్లో ఫలసాయం ఇచ్చే కాఫీతోటలను గిరిజనులు సాగు చేస్తున్నారు. వాటిలో 1.10 లక్షల ఎకరాల్లో మిరియాల పాదులను అంతరపంటగా వేశారు.ఎకరానికి తక్కువలో చూసుకున్న 100 కిలోల ఎండు మిరియాలను రైతులు మార్కెటింగ్‌ చేస్తారు. ఎకరానికి రూ.60వేల నుంచి రూ.70వేల వరకు ఆదాయం లభిస్తుంది.గత ఏడాది 11వేల టన్నుల వరకు దిగుబడి వచ్చింది.ప్రైవేట్‌ వ్యాపారులు పోటాపోటీగా కొనుగోలు చేశారు. ఈ ఏడాది కూడా వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో మిరియాల పాదులకు కాపు విరగ్గాసింది. దిగుబడులు మరింత పెరిగి కనీసం 12వేల టన్నుల వరకు మార్కెట్‌ జరుగుతుందని ఉద్యానవన,కాఫీబోర్డు,స్పైసెస్‌ బోర్డు అధికారులు అంచాన వేస్తున్నారు.

మిరియాల సేకరణ ప్రారంభం

మన్యంలో మిరియాల పంట దిగుబడి దశకు రావడంతో గిరిజన రైతులు పాదులకు ఉన్న గింజల సేకరణను ప్రారంభించారు.గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో స్పైసెస్‌ బోర్డు,పాడేరు ఐటీడీఏలు అల్యూమినియం నిచ్చెనలను పంపిణీ చేయడంతో గిరిజన రైతులకు ఎంతో మేలు జరిగింది.వాటితోనే మిరియాలను సేకరిస్తున్న గిరిజన రైతులు వెనువెంటనే వేడినీళ్లలో నానబెట్టి ఎండు మిరియాలను తయారు చేస్తున్నారు.గింజల్లో తేమ పూర్తిగా పోయిన తరువాత గిరిజన రైతులు సంతల్లో అమ్మకాలు చేపడుతున్నారు.

కిలో రూ.550 ధరతో కొనుగోళ్లు ప్రారంభం

జిల్లాలో మిరియాల వ్యాపారం ప్రారంభమైంది.ప్రారంభ దశ కావడంతో వ్యాపారులు కిలో రూ.550ధరతో కొనుగోలు చేస్తున్నారు.ఈ ఏడాది కూడా మన్యం మిరియాలకు డిమాండ్‌ అధికంగా ఉందని పెద్ద వ్యాపారులు చెబుతున్న నేపథ్యంలో వచ్చే వారం నుంచి ధరలు పెంచి వ్యాపారులు పోటాపోటీగా కొనుగోలు చేసే అవకాశం ఉంది. అయితే కాఫీ పంట వలే మిరియాలను కూడా జీసీసీ,పాడేరు ఐటీడీఏలు కొనుగోలు చేయాలని గిరిజన రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
మురిసేలా మిరియం1
1/2

మురిసేలా మిరియం

మురిసేలా మిరియం2
2/2

మురిసేలా మిరియం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement