బంగారం చోరీ కేసులో నిందితుడికి రిమాండ్
మాట్లాడుతున్న రూరల్ సీఐ అశోక్‌కుమార్
అనకాపల్లి: దొంగతనం కేసులో తప్పించుకుని తిరుగుతున్న మండలంలో మాకవరం గ్రామానికి చెందిన గంజి మంగరావును మండలంలో మార్టూరు జంక్షన్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించినట్లు రూరల్ సీఐ జి.అశోక్‌కుమార్ మంగళవారం తెలిపారు. మండలంలో పెదమాకవరం గ్రామానికి చెందిన దాసరి నారాయణరావు ఇంట్లో ఈ నెల 13న రెండు తులాలు బంగారం చోరీకి గురైనట్లు అతడి మనవరాలు కరణం రేణుక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడిని పట్టుకుని తులమున్నర బంగారంతోపాటు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో చోరీ చేసిన బైక్(యూనీకాన్ బైక్)ను స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో రూరల్ ఎస్‌ఐ రవికుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment