24న సర్టిఫికెట్‌ కోర్సులకు ఇంటర్వ్యూ | - | Sakshi
Sakshi News home page

24న సర్టిఫికెట్‌ కోర్సులకు ఇంటర్వ్యూ

Published Wed, Feb 19 2025 1:39 AM | Last Updated on Wed, Feb 19 2025 1:39 AM

-

మురళీనగర్‌: కంచరపాలెం ప్రభుత్వ కెమికల్‌ ఇంజినీరింగ్‌ ఇనిస్టిట్యూట్‌ (గైస్‌)లో స్వల్పకాలిక సర్టిఫికెట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 24న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.వెంకటరమణ తెలిపారు. ఏడాది వ్యవధి కలిగిన పారిశ్రామిక భద్రత కోర్సులో 60 సీట్లు, 6 నెలల వ్యవధితో ఫైర్‌ సేఫ్టీ కోర్సు లో 30 సీట్లు, 4 నెలల వ్యవధితో ఆఫీస్‌ ఆటోమేషన్‌ కోర్సులో 20 సీట్లు, 3 నెలల వ్యవధితో కెమికల్‌ సూపర్‌వైజరీ ప్రొగ్రామ్‌లో 20 సీట్లు ఉన్నాయన్నారు. ఆసక్తి ఉన్నవారు టెన్త్‌ పాస్‌/డిప్లొమా/ఇంటర్‌/డిగ్రీ సర్టిఫికెట్‌, ఆధార్‌, రెండేళ్ల పారిశ్రామిక అనుభవ ధ్రువీకరణపత్రం ఒరిజినల్‌తో పాటు ఒక సెట్‌ జెరాక్స్‌తో ఆ రోజు ఉదయం 10గంటలకు హాజరు కావాలన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement