కొబ్బరి రైతుకు ధీమా
●కొబ్బరి చెట్లకు బీమా పథకం
●ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోతే పరిహారం
●ఉద్యానవన అధికారి భాను పుష్పలీలావతి
మాడుగుల రూరల్: రైతుల కోసం ఎన్నో పథకాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. వాటిపై అవగాహన లేకపోవడం, క్షేత్రస్థాయిలో సరైన ప్రచారం లేకపోవడంతో ఇప్పటికీ చాలామంది ప్రభుత్వ ఫలాలు పొందలేకపోతున్నారు. పర్యవసానంగా ప్రకృతి వైపరీత్యాల సమయంలో తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా(ఎ.ఐ.సి) అనే కేంద్ర ప్రభుత్వ రంగ బీమా సంస్థ, కొబ్బరి అభివృద్ధి బోర్డు(సీడీబీ), రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో కొబ్బరి చెట్లకు కలిగిన నష్టం వల్ల వచ్చే ఆర్థిక ఇబ్బందులు నుంచి రైతులను ఆదుకునేందుకు కొబ్బరి చెట్ల బీమా పథకాన్ని అమలు చేస్తున్నాయి. ఈ మేరకు కొబ్బరి చెట్ల బీమా పథకం(సి.పి.ఐ.ఎస్) ద్వారా కొబ్బరి రైతులు ప్రీమియం చెల్లించాలని మండల ఉద్యానవన శాఖాధికారి వి. భాను పుష్పలీలావతి పేర్కొన్నారు. దీనివల్ల పొందే ప్రయోజనాలు గురించి సాక్షికి ఆమె వివరించారు.
బీమాకు వర్తించే కొబ్బరి చెట్లు...
టాల్, హైబ్రిడ్, డ్వార్ప్ రకాలకు చెందిన కొబ్బరి చెట్లకు కింద పేర్కొన్న సంవత్సర మధ్యలో ఉంటే బీమా వర్తిస్తుంది. డ్వార్ప్, హైబ్రిడ్: కొబ్బరి చెట్లు 4 నుంచి 60 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. టాల్ చెట్లు 7 నుంచి 60 సంవత్సరాల వరకు వయసు చెట్లుకు బీమా ప్రీమియం చెల్లించవచ్చు. ఏ రైతు స్థలంలోనైనా కనీసం ఐదు ఆరోగ్యకరమైన చెట్లు ఉంటే బీమాకు అర్హులు.
నష్టపరిహారం వర్తించే అంశాలు...
తుఫాన్, వడగండ్ల వాన, సుడిగాలి, భారీ వర్షాలు, వరద ముప్పు, చీడపీడలు వల్ల చెట్లుకు నష్టం జరుగుట. ప్రమాదవశాత్తు అగ్ని లేదా మెరుపులుతో కూడిన మంటలు, భూకంపం, కొండచరియలు విరిగిపడటం, సునామీ, తీవ్ర కరువు, చెట్టు మొత్తం నష్టపోవడం వంటి వాటికి ఈ బీమా వర్తిస్తుంది.
బీమాలో సబ్సిడీ...
బీమా ప్రీమియంలో సబ్సిడీ కూడా ఉంటుంది. ప్రీమియంలో 50 శాతం కోకోనట్ డెవలప్‌మెంట్ బోర్డు, 25 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. మిగిలిన 25 శాతం మాత్రమే రైతు చెల్లించాలి. రైతులు రెండు సంవత్సరాలు బీమాకు ప్రీమియంలో 7.5 శాతం రాయితీ, మూడు సంవత్సరాలు బీమాకు 12.5 శాతం రాయితీ వర్తిస్తుంది. మూడు సంవత్సరాలు కాలపరిమితికి బీమా చేసుకోవచ్చు. ఒక చెట్టుకు మూడు సంవత్సరాలకు ప్రీమియం రూ. 27.65 అయితే, సబ్సిడీ పోను రూ. 5.90 పైసలు (నాలుగు నుంచి 15 సంవత్సరాల వయస్సు కలిగిన చెట్లు), 16 నుంచి 60 సంవత్సరాల వయస్సు కలిగిన ఒక చెట్టుకు మూడు సంవత్సరాలకు రూ. 40.69 పైసలు చెల్లించాల్సి ఉండగా, రైతు ప్రీమియం రూ.9.19 పైసలు చెల్లించాలి. పూర్తి వివరాలు కోసం తమ సమీపంలో రైతు సేవా కేంద్రంలో వీఏఏ లేదా వీహెచ్‌ఏలను సంప్రందించాలి.
కొబ్బరి రైతుకు ధీమా
కొబ్బరి రైతుకు ధీమా
Comments
Please login to add a commentAdd a comment