రంగురాళ్లు తవ్వుతున్న 10 మంది అరెస్ట్
చింతపల్లి (అల్లూరి జిల్లా): చింతపల్లి అటవీశాఖ సబ్ డివిజన్ పరిధిలో గల సిగనాపల్లిలో అక్రమంగా రంగురాళ్లు తవ్వుతున్న 10 మందిని అరెస్టు చేసినట్టు పెదవలస రేంజ్ అధికారి శివరంజిని తెలిపారు. జీకే వీధి మండలం సంకాడ పంచాయతీ పరిధిలో గల సిగనాపల్లి సమీపంలో కొండపై రంగురాళ్లు తవ్వకాలు జరుగుతున్నట్టు అందిన సమాచారం మేరకు మంగళవారం సిబ్బందితో దాడి చేసినట్టు చెప్పారు. రంగురాళ్లు తవ్వుతున్న కాకినాడ జిల్లా పత్తిపాడు మండలం ఒమ్మంగి గ్రామానికి చెందిన 10 మందిని అరెస్టు చేసి, వారి నుంచి 2.2 గ్రాముల రంగురాళ్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. రంగురాళ్ల క్వారీ వద్ద విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు ప్రొడక్షన్ వాచర్లను విధుల నుంచి తొలగించినట్టు రేంజ్ అధికారి శివరంజని తెలిపారు. ఫారెస్టు బీట్ ఆఫీసర్ గోపి, స్టైకింగ్ ఫోర్స్, బేస్ క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు.
రంగురాళ్లు తవ్వుతున్న 10 మంది అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment