రాష్ట్ర పురుషుల కబడ్డీ జట్టు ఎంపిక
ఎంవీపీకాలనీ: జాతీయ స్థాయి పోటీలకు ఆంధ్రప్రదేశ్ పురుషుల కబడ్డీ జట్టు ఎంపికై ంది. ఈ మేరకు విశాఖ కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి జేఎస్‌వీ ప్రసాదరెడ్డి తెలిపారు. గత కొన్ని రోజులుగా 19 మంది క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ అందించగా సెలక్షన్ కమిటీ సభ్యులు మంగళవారం 12 మందితో కూడిన తుదిజట్టును ఎంపిక చేశారని పేర్కొన్నారు. ఎంపికై న రాష్ట్ర కబడ్డీ పురుషుల జట్టు ఒడిశాలోని కటక్ వేదికగా జరగనున్న 71వ జాతీయ కబడ్డీ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ తరపున ప్రాతినిధ్యం వహిస్తుందన్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి 23వ తేదీ వరకు కటక్‌లో ఈ పోటీలు జరగనున్నట్లు తెలిపారు. సెలక్షన్ కమిటీ సభ్యులుగా కబడ్డీ నేషనల్ మెడలిస్ట్, విశాఖ కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి ప్రసాదరెడ్డి, అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారులు సీహెచ్ పద్మరాజు, వైవీ శ్రీనివాస్‌లు వ్యవహరించారు. ఎంపికై న రాష్ట్ర జట్టును జి.రామకృష్ణ చౌదరి, లాలం రమేష్, ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి వై.శ్రీకాంత్, సీనియర్ జాతీయ క్రీడాకారుడు వీవీ రమణ, సీహెచ్ పద్మరాజు తదితర క్రీడా ప్రముఖులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment