కల్చరల్ వర్క్‌షాప్‌లో జె.నాయుడుపాలెం ఉపాధ్యాయిని
● బోధనలో సంస్కృతీ సంప్రదాయాలను జోడించేలా శిక్షణ
రోలుగుంట: మండలంలోని జె.నాయుడుపాలెం జెడ్పీ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఆంగ్ల ఉపాధ్యాయిని కె.వి.ఎల్.ప్రవీణ కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రాజస్థాన్ రాష్ట్రం ఉదయ్‌పూర్‌లో నిర్వహించిన వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు. ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్ ఆధ్వర్యంలో ఈ వర్క్‌షాప్ జరిగింది. ఇందుకు రాష్ట్రం నుంచి ఎంపికై న ఇద్దరిలో ప్రవీణ ఒకరు. ఈమె ఈ నెల 11న వెళ్లి అయిదు రోజులపాటు శిక్షణ పొందారు. శిక్షణానంతరం సీసీఆర్టీ డైరెక్టర్ రాజీవ్ జైన్ నుంచి ధ్రువపత్రాన్ని అందుకున్నారు. విజయవంతంగా శిక్షణ ముగించుకున్న ఆమెను హెచ్‌ఎం దాడిఽశెట్టి రమేష్‌కుమార్, ఉపాధ్యాయులు పాఠశాలలో మంగళవారం అభినందించారు. ఆమె మాట్లాడుతూ బోధనలో భారతీయ సాంస్కృతిక సంప్రదాయాలను జోడించాలని సీసీఆర్టీ డైరెక్టర్ రాజీవ్ జైన్, డిప్యూటీ డైరెక్టర్ సందీప్ శర్మ సూచించారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment