వైఎస్ జగన్‌తో కురసాల కన్నబాబు భేటీ
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్న పార్టీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు
సాక్షి, విశాఖపట్నం: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో పార్టీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు బుధవారం భేటీ అయ్యారు. ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్‌గా కీలక బాధ్యతలు అప్పగించిన తర్వాత తొలిసారి ఆయన జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో సమస్యలు గుర్తించి, వాటిపై పోరాడాలని జగన్‌మోహన్‌రెడ్డి కన్నబాబుకు నిర్దేశించారు. టీడీపీ కూటమి ప్రభుత్వంపై ఇప్పటికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఇంకా ఎండగట్టాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణుల్ని మరింత సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని సూచించారు. నిత్యం ప్రజల్లో ఉంటూ, వారితో మమేకమవుతూ, వారు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, పార్టీ పరంగా వేగంగా స్పందించి అండగా నిలవాలని కన్నబాబుకు అధినేత వైఎస్ జగన్ ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment