తాగుడుకు బానిసై వ్యక్తి ఆత్మహత్య
రాంబిల్లి (యలమంచిలి) : మద్యానికి బానిసై జీవితంపై విరక్తి చెందిన వలస కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన లాలం కోడూరు గ్రామంలో జరిగింది. రాంబిల్లి ఎస్‌ఐ నాగేంద్ర తెలిపిన వివరాలివి. కోనసీమ జిల్లా ఆత్రేయపురం గ్రామానికి చెందిన గునిపూడి సురేష్(38) కొంత కాలంగా స్థానిక ఫార్మాపరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి తాము నివాసం ఉంటున్న లాలం కోడూరు గ్రామం వద్ద ఉన్న రూమ్‌లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లిదండ్రులు మృతి చెందగా, భార్య నుంచి మూడేళ్లుగా విడిపోవడం వంటి కారణాలతో సురేష్ మద్యానికి బానిసయ్యాడని, జీవితంపై విరక్తి చెంది ఈ ఘటనకు పాల్పడినట్టు స్థానికులు, బంధువులు తెలిపారన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment