సినీ ఫక్కీలో గంజాయి కారు పట్టివేత
● మరో ఇద్దరు పరార్ ● కారు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం
యలమంచిలి రూరల్ : పదహారో నంబరు జాతీయ రహదారిపై బుధవారం వాహనాలు తనిఖీ చేస్తున్న ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో పోలీసులకు యలమంచిలి నుంచి తుని వైపు ర్యాష్ డ్రైవింగ్‌తో వెళ్తున్న కేరళ రాష్ట్రానికి చెందిన ఓ కారుపై అనుమానం వచ్చి వెంబడించి పట్టుకున్నారు. కారులో ఓ వ్యక్తి ఎకై ్సజ్ పోలీసులకు పట్టుబడగా డ్రైవర్ పరారయ్యాడు. కారులో 4 ప్లాస్టిక్ సంచుల్లో ఒక్కొక్కటి రెండు కేజీల బరువున్న 49 గంజాయి ప్యాకెట్లను పోలీసులు గుర్తించారు. 98 కేజీలు ఉన్న దీని విలువ సుమారుగా రూ.4.90 లక్షలు ఉంటుంది. అనకాపల్లి ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ అసిస్టెంట్ కమిషనర్ సుర్జీత్ సింగ్ తెలిపిన వివరాలివి. ఒడిశాలోని బరంపురం నుంచి కసర్‌గూడ్‌కు వెళుతున్న కేఎల్14జెడ్8008 స్విఫ్ట్ కారుకు కుడివైపు యాక్సిడెంట్ అయినట్టు ఉండడం, కేరళ రిజిస్ట్రేషన్ నంబరు ఉండడంతో అను మానం వచ్చిన ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో పోలీసులు కారును ఆపడానికి ప్రయత్నించారు. కానీ ఆగకుండా వేగంగా వెళ్లిపోవడంతో దానిని వెంబడించారు. యలమంచిలి తండాలదిబ్బ సమీపంలో ఓ హోటల్ వద్ద కారు పార్క్ చేసి ఉండడాన్ని గుర్తించి సోదా చేయగా అందులో 49 గంజాయి ప్యాకెట్లు గుర్తించారు. కారులో ఉన్న కేరళకు చెందిన మోయుద్దీన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. పరారైన కారు డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. గంజాయి, కారుతో పాటు రెండు ఫోన్లు, జియో డోంగిల్ డివైజ్, రూ.5600 నగదును స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడ్ని కోర్టులో హాజరుపర్చగా జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. సకాలంలో స్పందించి వాహనాన్ని పట్టుకున్న యలమంచిలి ఎకై ్సజ్ పీఎస్, ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో సిబ్బందిని ఏసీ సుర్జీత్‌సింగ్ అభినందించారు. ఈ కేసును ఛేదించిన వారిలో యలమంచిలి ఎకై ్సజ్ సీఐ తేజో వెంకట కుమార్, ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ అప్పలనాయుడు, ఎస్‌ఐలు సోమయ్య, శ్రావణి, పీవీ గిరిబాబు సిబ్బంది ఉన్నారు.
గంజాయితో ముగ్గురు అరెస్టు
నర్సీపట్నం : కారులో గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను నాతవరం పోలీసులు అరెస్టు చేశారని నర్సీపట్నం డీఎస్పీ పి.శ్రీనివాసరావు తెలిపారు. ముగ్గురు నిందితులు పట్టుబడగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారన్నారు. నాతవరం పోలీసులు గంజాయి నిందితులు, స్వాధీనం చేసుకున్న గంజాయిని డీఎస్పీ ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ బుధవారం రూరల్ సీఐ ఎల్.రేవతమ్మ, నాతవరం ఎస్‌ఐ భీమరాజు, సిబ్బందితో ములగపూడి జంక్షన్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా నర్సీపట్నం నుంచి తుని వైపు కారులో వస్తున్న వ్యక్తులు కారు ఆపి పరారవుతుండగా తమ సిబ్బంది వెంబడించి పట్టుకున్నారన్నారు. కారు డిక్కీలో గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయన్నారు. పట్టుబడిన వారి లో నర్సీపట్నం మండలం, నీలంపేటకు చెందిన ఆర్.బోడకొండ(29), చింతపల్లి మండలం, రాళ్లగెడ్డ వి.గిరిబాబు (27), నర్సీపట్నానికి చెందిన భార్గవ సాయిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. మరో ఇద్దరు వ్యక్తులు నర్సీపట్నం మండలం గబ్బాడకు చెందిన అప్పలనాయుడు, చింతపల్లి మండలం రాళ్లగెడ్డకు చెందిన కె.రమేష్ పరారీలో ఉన్నారని తెలిపారు. కారుతో పాటు 122 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, పట్టుబడ్డ గంజాయి విలువ రూ.6.10 లక్షలు ఉంటుందని తెలిపారు. అలాగే నిందితుల వద్ద నుంచి 3 సెల్‌ఫోన్‌లను స్వాధీన పర్చుకున్నామన్నారు.
సినీ ఫక్కీలో గంజాయి కారు పట్టివేత
Comments
Please login to add a commentAdd a comment