అవగాహనతోనే రోడ్డు ప్రమాదాల నివారణ
తుమ్మపాల: జిల్లాలో ద్విచక్ర వాహనాలు నడిపే వారికి హెల్మెట్‌ధారణ తప్పనిసరి చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన జాతీయ రహదారి భద్రతా సమన్వయ కమిటీ జిల్లా స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర లైటింగ్ ఏర్పాటు చేయాలని, స్పీడ్ బ్రేకర్ల దగ్గర కలర్ పెయింటింగ్ వేయాలన్నారు. ప్రమాదాల వల్ల చనిపోయిన వారికి త్వరితగతిన పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడపడం, అతివేగం వల్ల జరిగే ప్రమాదాల గురించి అందరికీ అవగాహన కల్పించాలని, పోస్టర్లు అతికించాలని, సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. కూడళ్లు, తరచూ ప్రమాదాలు జరిగే ప్రదేశాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రమాదాలు జరిగిన వెంటనే ప్రజలు స్పందించి క్షతగాత్రులను దగ్గరలోని ఆస్పత్రుల్లో చేర్పించాలని కోరారు. అటువంటి వారికి అవార్డులు ప్రకటించాలని, ఇందుకు స్థానిక ఎంపీడీవో, ఎస్‌హెచ్‌వోల వద్ద రిజిస్ట్రేషన్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా రవాణా శాఖ అధికారి వి. మనోహర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గిందని, ప్రమాదాలను పూర్తిగా నివారించేందుకు జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని కృషి చేస్తామన్నారు. ఇప్పటికే హెల్మెట్ ధరించని వారిని, రాంగ్ రూట్‌లో వచ్చే వారిని, లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపే వారిని గుర్తించి అపరాధ రుసుములు విధిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి. రవికుమార్, జిల్లా ట్రాఫిక్ రికార్డు బ్యూరో డీఎస్పీ వి.మోహన్ రావు, ఆర్‌అండ్‌బీ డీఈ విద్యా సాగర్, జీవీ ఎంసీ అధికారులు, జాతీయ, రాష్ట్ర రహదారుల అధికారులు, ఎంవీ ఇన్‌స్పెక్టర్లు, పోలీస్ ఇన్‌స్పెక్టరు పాల్గొన్నారు.
ద్విచక్ర వాహన చోదకులకు హెల్మెట్ తప్పనిసరి చేయాలి
కలెక్టర్ విజయ కృష్ణన్
Comments
Please login to add a commentAdd a comment