ఘనంగా బౌద్ధ సమ్మేళనం
● బొజ్జన్నకొండ వద్ద శాంతి ర్యాలీ ● బుద్ధ భూమి మాసపత్రిక ఆవిష్కరణ
అనకాపల్లి టౌన్: ప్రపంచానికి మొట్ట మొదటిసారిగా శాంతి, ధర్మం, అహింసా మార్గాలను బోధించిన మహానుభావుడు బుద్ధుడని రాష్ట్ర మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు అన్నారు. మండలంలోని శంకరం ప్రముఖ బౌద్ద పర్యాటక క్షేత్రం బొజ్జన్నకొండ వద్ద బౌద్ధ సమ్మేళనం ఘనంగా ఆదివారం జరిగింది. జిల్లా బుద్దిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు పల్లా బాబ్జీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముందుగా కొండ మెట్ల మార్గం గుండా బుద్ధుని విగ్రహం వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బౌద్ధ సంఘాల సమాఖ్య ప్రతినిధులు, బౌద్ద ఉపాసకులు, బౌద్ద అభిమానులు, విదేశీ బౌద్ధ భిక్షువులు వెనరబుల్ పూజ్య బ్రరామో బాంతేజీ (కంబోడియా), రాజాభాంతేజీ(బర్మా)లు పాల్గొని ప్రార్థనలు నిర్వహించి ప్రపంచ శాంతి స్థాపనకు అందరూ దోహద పడాలని కోరారు. కార్యక్రమంలో భాగంగా బుద్ధభూమి మాస పత్రికను ఆవిష్కరించారు. రాష్ట్ర బుద్దిస్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు వై హరిబాబు, విశాఖ బౌద్ధ సంఘాల సమాఖ్య గౌరవఅధ్యక్షుడు డాక్టర్ మాటూరి శ్రీనివాస్, బౌద్ధ సంఘాల ప్రతినిధులు బొడ్డు కల్యాణరావు, పి.రాంబాబు, ఎన్.గంగాధర్, వి.వి.దుర్గారావు, బోర వేణు గోపాల్, బౌద్ధ సంఘాల సమాఖ్య ప్రచార కమిటీ సభ్యుడు బల్లా నాగభూషణం పాల్గొన్నారు.
ఘనంగా బౌద్ధ సమ్మేళనం
Comments
Please login to add a commentAdd a comment