పార్టీ జిల్లా అధ్యక్షుడు బూడి ముత్యాలనాయుడు
చెరకు రైతులకు అండగా వైఎస్సార్‌సీపీ
దేవరాపల్లి: గోవాడ సుగర్ ఫ్యాక్టరీ చెరకు రైతులకు వైఎస్సార్‌సీపీ అండగా నిలుస్తుందని మాజీ డిప్యూటీ సీఎం, పార్టీ జిల్లా అధ్యక్షుడు బూడి ముత్యాలనాయుడు అన్నారు. ఆదివారం తారువలో ఆయన మాట్లాడుతూ గోవాడ సుగర్ ఫ్యాక్టరీలో చెరకు రైతులతో సోమవారం నిర్వహించే ముఖాముఖి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ హాజరై చెరకు రైతులు, కార్మికుల సమస్యలు, కష్టనష్టాలను అడిగి తెలుసుకుంటారన్నారు. వీటిపై శాసన మండలిలో ప్రస్తావించడంతోపాటు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తారన్నారు. ముఖాముఖి కార్యక్రమానికి ఫ్యాక్టరీ చెరకు రైతులు, పార్టీ నాయకులు తరలిరావాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment