వీహెచ్‌పీ జిల్లా ఉపాధ్యక్షుడిగా రామకొండలరావు
మాడుగుల రూరల్: విశ్వ హిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షుడిగా, మాడుగుల ప్రఖండ్ బాధ్యులు రాపేట రామకొండలరావు మాస్టరును నియమించారు. ఈ నెల 8,9, తేదీల్లో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సమీపంలో గల వీరంపాలెం గ్రామంలో గల బాల త్రిపుర సుందరీ సహిత, పరమేశ్వర ఆలయంలో జరిగిన విశ్వ హిందూ పరిషత్ ఉత్తరాంధ్ర ప్రాంత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్రంలో 19 జిల్లాలకు చెందిన విశ్వహిందూ పరిషత్ బాధ్యులు హాజరయ్యారు. దీనికి కేంద్ర కమిటీ బాధ్యులు కోటేశ్వరశర్మ, ఉత్తరాంధ్ర ప్రాంత అధ్యక్షుడు వెంకటేశ్వరావు, ప్రాంత కార్యదర్శి సుబ్బరాజు, ఉత్తరాంధ్ర జిల్లాల కమిటీ సభ్యులతో జరిగిన సమావేశంలో జిల్లా వీహెచ్‌పీ ఉపాధ్యక్షుడిగా రామకొండలరావును నియమించారు. రామకొండలరావు గతంలో మాడుగుల మండల వీహెచ్‌పీ అధ్యక్షుడిగా పనిచేశారు. అప్పట్లో అయోధ్య నుంచి తీసుకొచ్చిన శ్రీరాముని అక్షింతలను ఆర్‌ఎస్‌ఎస్, వీహెచ్‌పీ, సమరతాసేవా ఫౌండేషన్ సభ్యుల సహకారంతో గ్రామాల్లో పంపిణీ చేశారు. మండలంలో 56 గ్రామాల్లో కమిటీలు ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment