పాత గొడవలతో వ్యక్తిపై కత్తితో దాడి
మునగపాక : మండలంలోని గొల్లలపాలెంలో గురువారం రాత్రి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామానికి చెందిన పక్కుర్తి నూకరాజుకు అదే గ్రామానికి చెందిన శీరా తాతబాబుకు గతంలో పాత గొడవలు ఉండేవి. దీనిలో భాగంగా గురువారం రాత్రి ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. దీంతో పక్కనే ఉన్న కల్లుగీత కార్మికునికి చెందిన కత్తితో తాతబాబుపై నూకరాజు దాడి చేశాడు. ఈ సంఘటనలో తాతబాబుకు తీవ్రగాయాలు కావడంతో అతనిని అనకాపల్లి వందపడకల ఆస్పత్రికి తరలించారు. దాడికి పాల్పడిన నూకరాజు కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ మేరకు హత్యాయత్నం కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.