
గ్రూప్ 2లో మెరిసిన ఆణిముత్యాలు
రావికమతం : మండలంలో మర్రివలస , గుమ్మాలపాడు గ్రామాలకు చెందిన ఎలిశెట్టి రవి, సిద్దా రవి ప్రసాద్ ఇద్దరూ గ్రూప్ 2 పరీక్షలో 300 మార్కులకు 230 మార్కులు సాధించారు. పేదింటిలో పుట్టిన ఈ యువకులు స్వయంకృషితో కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించి త్వరలో ప్రభుత్వ కొలువులో చేరనున్నారు. మర్రివలస గ్రామానికి చెందిన రవి తండ్రి వరహాలు కోనేళ్ల కిందట మరణించారు. తల్లి పాప కూలి పని చేస్తూ రవిని కష్టపడి చదివించింది. పదో తరగతి నుంచి డిగ్రీ వరకు మంచి మార్కులతో పాసయ్యారు. కాకినాడ సూరంపాడు ఆదిత్యలో టెస్ట్ రాసి ఈ ఏడాది ఫిబ్రవరి 23న జరిగిన గ్రూప్2 పరీక్ష రాశారు. అలాగే గుమ్మాలపాడు గ్రామానికి చెందిన రవి ప్రసాద్ పదో తరగతి ప్రభుత్వ పాఠశాలలో చదివి 10 బై 10 మార్కులు సాధించి త్రిబుల్ ఐటీలో సీటు సాధించారు. ఆపై విప్రో కంపెనీలో ఉద్యోగం చేస్తునే గ్రూప్ 2 పరీక్షలు రాశారు. శుక్రవారం రాత్రి ఫలితాలు విడుదల కావడంతో ఇరువుకి 300 మార్కులగాను 230 మార్కులు సాధించి సత్తా చాటారు.ఇరువురిని ఆయా గ్రామాల పెద్దలు,యువకులు అభినందించారు.

గ్రూప్ 2లో మెరిసిన ఆణిముత్యాలు