●ప్రతి నెలా పెన్షన్‌ టెన్షన్‌ | - | Sakshi
Sakshi News home page

●ప్రతి నెలా పెన్షన్‌ టెన్షన్‌

Published Fri, Apr 11 2025 12:42 AM | Last Updated on Fri, Apr 11 2025 12:42 AM

●ప్రత

●ప్రతి నెలా పెన్షన్‌ టెన్షన్‌

పాలకులు ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకోవాలి. వారి యోగక్షేమాలు తెలుసుకొని సమస్యలు పరిష్కరించాలి. రాజకీయాలకు, రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించాలి. అప్పుడే అది ప్రజా ప్రభుత్వం. తమకు ఓటు వేయలేదనో, ప్రతిపక్ష పార్టీ సానుభూతిపరుడనో కక్ష కట్టి నిబంధనలకు విరుద్ధంగా పెన్షన్లు తొలగించినా, ఇబ్బందులు పెట్టినా అది ప్రజా కంటక ప్రభుత్వం. కూటమి సర్కారు వచ్చాక జనం అలాంటి చేదు అనుభవాలను ఎదుర్కొంటున్నారు. దివ్యాంగులు, వృద్ధాప్యంతో బాధ పడుతున్నవారు, రాజకీయాలకు దూరంగా బతికే సామాన్యులను సైతం అధికార పార్టీ ప్రతినిధులు వదిలిపెట్టడం లేదు. లబ్ధిదారుల సంఖ్యను తగ్గించడమే ఏకై క లక్ష్యంగా.. వేధింపులే ఆదర్శంగా.. పింఛన్లను నిలిపివేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే 10,136 పింఛన్లకు కోత పెట్టడమే ఇందుకు ఉదాహరణ.

వైఎస్సార్‌సీపీకి ఓటు వేశానని..

నా వయస్సు 70 ఏళ్లు. ఆరేళ్లుగా వృద్ధాప్య పింఛను అందుకుంటున్నాను. వైఎస్సార్‌సీపీకి ఓటు వేశానని టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే నా పింఛను తీసేశారు. అధికారులను అడిగితే వస్తాయని చెబుతున్నారు. ఎమ్మార్వో, ఆర్డీవో, కలెక్టర్‌ కార్యాలయాలకు వెళ్లి అర్జీలు ఇచ్చాను. కానీ ఫలితం లేదు.

– శ్రీరామ్మూర్తి,

వెంకటాపురం, గొలుగొండ మండలం

నాకు కన్ను కనిపించదు.. సర్కారుకు గోడు వినిపించదు

నాకు ఒక కన్ను పూర్తిగా కనిపించదు. 2019లో వికలాంగ పింఛన్‌ మంజూరైంది. 2024 జూన్‌ వరకు పెన్షన్‌ వచ్చింది. కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత పింఛన్‌ నిలిపివేశారు. పలుసార్లు మండల, డివిజన్‌ స్థాయి అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు.

–నల్లబెల్లి వరలక్ష్మి, పాకలపాడు, గొలుగొండ మండలం

కోర్టులోనే న్యాయం జరగాలి

నాకు వెన్నుపూస సమస్య ఉంది. నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో చికిత్స అందించారు. వికలాంగుల సర్టిఫికెట్‌ దాఖలు చేయగా నాకు పింఛన్‌ మంజూరయింది. గత ఏడాది జూన్‌ వరకు పింఛన్‌ అందుకున్నాను. కూటమి ప్రభుత్వం వచ్చాక నా పెన్షన్‌ ఆగిపోయింది. దీనిపై కోర్టును ఆశ్రయించాను.

–నల్లబెల్లి రాజేశ్వరి,

పాకలపాడు, గొలుగొండ మండలం

మంచానికే పరిమితం

నాకు కాలు, చేయి పనిచేయదు. గత ప్రభుత్వం పింఛన్‌ మంజూరు చేసింది. దీంతో జీవనం సాగించేదానిని. కొత్త ప్రభుత్వం వచ్చాక రెండు నెలలు మాత్రమే పింఛన్‌ ఇచ్చి తరువాత నిలిపివేశారు. అధికారులను అడిగితే సరైన సమాధానం ఇవ్వడం లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నాను.

–బంగారు అచ్చియ్యమ్మ,

పాకలపాడు, గొలుగొండ మండలం

రాజకీయం..

అమానవీయం

వృద్ధులు, వికలాంగులు అన్న జాలి లేదు

లబ్ధిదారుల సంఖ్యకు కత్తెర వేయడమే లక్ష్యం

వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులే టార్గెట్‌గా ఏరివేత

డోలీ మోతతో నిరసన తెలిపాడని మరొకరి పింఛన్‌ కట్‌

మళ్లీ ధ్రువపత్రాలు తెచ్చుకోవాలని దివ్యాంగులకు వేధింపులు

10 నెలల కూటమి పాలనలో ఏకంగా 10,136 పింఛన్లకు కోత

వైఎస్సార్‌సీపీ మద్దతు సర్పంచ్‌ తమ్ముడి పింఛను తొలగింపు

పింఛన్‌ వంచన

●ప్రతి నెలా పెన్షన్‌ టెన్షన్‌ 
1
1/4

●ప్రతి నెలా పెన్షన్‌ టెన్షన్‌

●ప్రతి నెలా పెన్షన్‌ టెన్షన్‌ 
2
2/4

●ప్రతి నెలా పెన్షన్‌ టెన్షన్‌

●ప్రతి నెలా పెన్షన్‌ టెన్షన్‌ 
3
3/4

●ప్రతి నెలా పెన్షన్‌ టెన్షన్‌

●ప్రతి నెలా పెన్షన్‌ టెన్షన్‌ 
4
4/4

●ప్రతి నెలా పెన్షన్‌ టెన్షన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement