
టెన్త్ మూల్యాంకనం పూర్తి
డీఈవో అప్పారావునాయుడిని అభినందిస్తున్న ఉపాధ్యాయులు
అనకాపల్లి టౌన్: జిల్లాలోని మూడు కేంద్రాలలో నిర్వహించిన పదో తరగతి పబ్లిక్ పరీక్షల మూల్యాంకనం పూర్తయిందని జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావునాయుడు తెలిపారు. ప్రభుత్వ నిబంధనలు, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పకడ్బందీగా వాల్యుయేషన్ ప్రక్రియ నిర్వహించామన్నారు. పరీక్షలు సజావుగా సాగడానికి సహకరించిన కలెక్టర్, ఎస్పీ, ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్, విద్యాశాఖాధికారులు, చీఫ్ ఎగ్జామినర్లు, అసిస్టెంట్ ఎగ్జామినర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.