జేఎన్‌టీయూ ఆడిటోరియంలో మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియ, జిల్లాలో మద్యం దుకాణాల కేటాయింపు ప్రశాంతంగా ముగిసినట్లు కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ ఆధ్వర్యంలో జేఎన్‌టీయూ ఆడిటోరియంలో నిర్వహించిన లాటరీ ప్రక్రియను ఎస్పీ జగదీష్‌తో కలిసి ఆయన పరిశీలించారు. కార్యక్రమం అనంతరం విలేకరులకు వివరాలు వెల్లడించారు. లాటరీ ప్రక్రియను పూర్తిగా వీడియో చిత్రీకరించినట్లు తెలిపారు. ఆయా షాపులకు టెండర్లు దాఖలు చేసిన దరఖాస్తుదారుల సమక్షంలోనే లక్కీడిప్ తీసి షాపు దక్కించుకున్న వారి పేరు ప్రకటించామన్నారు. మొత్తం 136 షాపులకు టెండర్లు నిర్వహించగా, ఒక్కో షాపునకు సరాసరి 24 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. లైసెన్సు లభించిన వ్యక్తి పేరున అకౌంట్ ఓపెన్ చేసి, బ్యాంకు అధికారుల ద్వారా చలానా జనరేట్ చేసి కన్ఫర్మేషన్ ఇచ్చామన్నారు. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టంగా నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ రామ్మోహన్ రెడ్డి, సీఐలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment