ఏటి గంగమ్మా.. చల్లంగ చూడమ్మ
ఉరవకొండ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం సమీపంలో పెన్నానది ఒడ్డున వెలసిన ఏటి గంగమ్మ తిరునాల ఆదివారం వైభవంగా జరిగింది. జిల్లా నలుమూలల నుంచే కాకుండా కర్ణాటక ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. ముందుగా భక్తులు పెన్నహోబిలంలో లక్ష్మీనృసింహస్వామికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం పవిత్ర పెన్నా నదిలో మాఘమాస పుణ్యస్నానాలు ఆచరించారు. నది సమీపంలోని ఏటి గంగమ్మ ఆలయంలో ఒడి బియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారికి కోళ్లు, గొర్రెలు, మేకలు బలి ఇచ్చి పచ్చని చెట్ల మధ్య వనభోజనాలు చేశారు. తిరునాల సందర్భంగా జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు చేపట్టారు. వైఎస్సార్‌సీపీ యువనేత వై.భీమిరెడ్డి ఆధ్వర్యంలో వార్డు సభ్యులు వనజాక్షి, ఆకుకూర నాగరాజులు భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో పెన్నహోబిలం ఆలయ ఈఓ రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
ఏటి గంగమ్మా.. చల్లంగ చూడమ్మ
Comments
Please login to add a commentAdd a comment