సజావుగా గ్రూప్–2 మెయిన్స్
అనంతపురం అర్బన్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్‌సీ) ఆధ్వర్యంలో ఆదివారం 14 కేంద్రాల్లో నిర్వహించిన గ్రూప్–2 మెయిన్స్ పరీక్ష సజావుగా జరిగింది. అభ్యర్థుల హాజరు 88.46 శాతం నమోదైంది. పరీక్షకు 7,293 మంది హాజరు కావాల్సి ఉండగా ఉదయం జరిగిన పేపర్–1 పరీక్షకు 6,463 మంది హాజరయ్యారు. 830 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పేపర్–2 పరీక్షకు 6,441 మంది హాజరుకాగా 852 మంది గైర్హాజరయ్యారు.పరీక్ష కేంద్రాలను కలెక్టర్ వి. వినోద్‌కుమార్, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ వేరువేరుగా సందర్శించి పరీక్షల తీరును, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తును జిల్లా ఎస్పీ పి.జగదీష్ తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ ప్రక్రియను ఏపీపీఎస్‌సీ అసిస్టెంట్ సెక్రటరీ ఎస్‌ఎన్‌షరీఫ్, సెక్షన్ ఆఫీసర్లు శంకర్‌రావు, ఆరోగ్యరాణి, నాగభవానీ పర్యవేక్షించారు.
ఏపీపీఎస్‌సీ తీరుపై అభ్యర్థుల ఆవేదన
ఏపీపీఎస్‌సీ జారీ చేసిన నోటిఫికేషన్ అసంబద్ధంగా ఉందని, రిజర్వేషన్ రోస్టర్ సక్రమంగా పాటించని కారణంగా తీవ్ర అన్యాయం జరుగుతుందని పలువురు అభ్యర్థులు వాపోయారు. రిజర్వేషన్ 70 శాతం దాటిందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతారన్నారు. ఇక మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌కు మించి కల్పించారని, దీంతో పురుష అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. అభ్యర్థుల శ్రేయస్సును, భవిష్యత్తును ఏపీపీఎస్‌సీ దృష్టిలో ఉంచుకుని రోస్టర్ సరిదిద్దిన తరువాతనే పరీక్ష ఫలి తాలను విడుదల చేయాలని పలువురు అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు.
88.46 శాతం అభ్యర్థుల హాజరు
కేంద్రాల పరిశీలన
అనంతపురం: ఎస్‌ఎస్‌బీఎన్, ఆర్ట్స్, నలంద, ఎస్వీ డిగ్రీ, జేఎన్‌టీయూ (ఏ), రైపర్, అనంతలక్ష్మి, కేఎస్‌ఎన్ డిగ్రీ గ్రూప్–2 మెయిన్స్ పరీక్ష కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను ఎస్పీ జగదీష్ పర్యవేక్షించారు. పోలీసు అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో జిరాక్స్ సెంటర్లను మూసివేసే విధంగా చర్యలు తీసుకున్నారు.
సజావుగా గ్రూప్–2 మెయిన్స్
సజావుగా గ్రూప్–2 మెయిన్స్
సజావుగా గ్రూప్–2 మెయిన్స్
Comments
Please login to add a commentAdd a comment