2.85 లక్షల మంది రైతులు.. రూ.57.02 కోట్లు
● నేడు పీఎం కిసాన్ నిధుల విడుదల
అనంతపురం అగ్రికల్చర్: ‘పీఎం కిసాన్’ కింద ఈ ఏడాది మూడో విడతగా సోమవారం రూ.2 వేల చొప్పున రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి సాయం విడుదల చేయనున్నారు. ఈ ఏడాది జూన్‌లో మొదటి విడతగా రూ.2 వేలు, రెండో విడతగా అక్టోబర్‌లో రూ.2 వేలు జమ చేశారు. తాజాగా 2,85,597 మంది రైతులకు రూ.57.02 కోట్లు విడుదలవుతున్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. అత్యధికంగా కళ్యాణదుర్గం మండలంలో 12,510 మందికి రూ.2.33 కోట్లు, వజ్రకరూరు– 11,674 మంది–రూ.2.33 కోట్లు, కంబదూరు–11,644 మంది– రూ.2.33 కోట్లు, విడపనకల్లు–11,191– రూ.2.24 కోట్లు, పెద్దవడుగూరు–10,707– రూ.2.14 కోట్లు, కుందుర్పి–10,642– రూ.2.143 కోట్లు, కణేకల్లు– 10,280– రూ.2.06 కోట్లు, గుంతకల్లు–10,213– రూ.2.04 కోట్లు, శెట్టూరు– 10,029 మందికి రూ.2.01 కోట్లు అందనుంది. అత్యల్పంగా పెద్దపప్పూరు మండలంలో 6,166 మంది రైతులకు రూ.1.23 కోట్ల పెట్టుబడి సాయం విడుదలైనట్లు అధికారులు తెలిపారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల పరిధిలో 42.04 లక్షల మంది రైతులకు 840.95 కోట్లు పీఎం కిసాన్ కింద సొమ్ము విడుదల చేయనున్నారు.
భక్తిశ్రద్ధలతో
అతిరుద్ర మహాయజ్ఞం
ప్రశాంతి నిలయం: ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహా సమాధి చెంత అతిరుద్ర మహాయజ్ఞం భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఆదివారం పదో రోజు ఉదయం వేదపండితులు వేద మంత్రాల నడుమ యజ్ఞ క్రతువులు నిర్వహించారు. సాయంత్రం యజ్ఞ క్రతువులలో భాగంగా కర్మార్చన, అష్టావధాన సేవ చేశారు. అనంతరం ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి గోదా అనంత సోమయాజీ అతిరుద్ర మహా యజ్ఞాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. తర్వాత ప్రముఖ సంగీత విద్వాంసుడు అభిషేక్ రఘురామ్ బృందం పరమేశ్వరుడిని కీర్తిస్తూ నిర్వహించిన సంగీత కచేరి అందరినీ అలరించింది.
Comments
Please login to add a commentAdd a comment