దోపిడీ ఇలా...
పెట్రోల్ బంకు వద్దకు చేరుకోగానే మనం కోరిన మొత్తానికి పంప్‌బాయ్ కీ బోర్డుపై బటన్ నొక్కి మీటర్ రీడింగ్‌లో సున్నా చూపించి పెట్రోల్/డీజిల్ వేయడం పరిపాటి. అయితే మనం చెల్లించిన మొత్తానికి సరిపడ పెట్రోల్/డీజిల్ ట్యాంక్‌లో పడిందనుకుంటే ప్రస్తుత కాలంలో పొరపాటవుతోంది. డిస్పెన్సరీ యూనిట్లకు ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ చిప్‌ల వల్ల ప్రతి లీటర్‌కు 100 మిల్లీలీటర్ల పెట్రోల్/డీజిల్ తక్కువగా ట్యాంక్‌లో పడుతున్న విషయాన్ని వినియోగదారులు పసిగట్టలేకపోతుండడంతో బంక్ నిర్వాహకుల మోసాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు డిస్పెన్సరీ యూనిట్‌ను వెంటనే ఆఫ్ చేసి ఆన్ చేస్తారు. ఈ చర్యతో మెజర్‌మెంట్ యూనిట్‌లో ఎలాంటి వ్యత్యాసం కనిపించదు. అయితే యూనిట్ ఆఫ్ చేసి ఆన్ చేయడం ద్వారా అందులో ఏర్పాటు చేసిన చిప్‌లోని ఇన్సిస్టెంట్ అప్లికేషన్ ఎగిరి పోయి పాత కొలతల మేరకే ఇంధనం పంపింగ్ జరుగుతుంది. తిరిగి కొలతల హెచ్చుతగ్గుల కోసం మరోసారి ఇన్సిస్టెంట్ అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేయిస్తుంటారు.
Comments
Please login to add a commentAdd a comment