పోలీసుల ఆంక్షలు దాటుకుని..
అనంతపురం కార్పొరేషన్: వైఎస్సార్ సీపీ ‘యువత పోరు’ విజయవంతం కాకుండా కూటమి సర్కారు కుట్రలు పన్నింది. పోలీసులను రంగంలోకి దింపి అడుగడుగునా ఆంక్షలు విధించింది. అనంతపురం ఎస్‌ఎస్‌బీఎన్ కళాశాల విద్యార్థులు ‘యువత పోరు’కు వచ్చేందుకు సిద్ధం కాగా, డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కళాశాల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. విద్యార్థులకు పరీక్షలున్నాయని, బయటకు వెళ్లడానికి వీళ్లేదంటూ పోలీసులు ఓవరాక్షన్ చేశారు. ఈ క్రమంలోనే అక్కడకు చేరుకున్న వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ గౌడ్, పలువురు ప్రజా సంఘాల నాయకులు పోలీసుల తీరుపై మండిపడ్డారు. పరీక్షలు లేకున్నా ఏ విధంగా వారిని అడ్డుకుంటారని నిలదీశారు. ర్యాలీ సజావుగా జరిగేలా చూడాల్సిన పోలీసులే యువతను రెచ్చగొట్టేలా వ్యవహరించడం దారుణమని రమేష్ గౌడ్ విమర్శించారు. దీంతో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోగా.. విద్యార్థులు పోలీసుల తీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు. తమ భవిష్యత్తు కోసం పోరాటం చేస్తుంటే అడ్డుకోవడమేంటని విద్యార్థినులు ప్రశ్నించడంతో పోలీసులు వెనక్కు తగ్గారు.
Comments
Please login to add a commentAdd a comment