సాక్షి, విజయవాడ: అమ్మఒడి పథకం యధాతథంగా అమలు చేస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, జీవో నంబర్ 3 విడుదల చేశామని.. 44,08,921 మందికి అమ్మఒడి వర్తింపు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రూ.6,161 కోట్లతో అమ్మఒడి పథకం అమలు చేస్తున్నామన్నారు. సోమవారం తల్లుల ఖాతాల్లో అమ్మఒడి నగదును సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జమ చేస్తారని మంత్రి పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో ఎమ్మెల్యేలు అమ్మఒడి కార్యక్రమంలో పాల్గొంటారని వెల్లడించారు.(చదవండి: మరోసారి వివాదాస్పద ఉత్తర్వులు జారీచేసిన నిమ్మగడ్డ)
ఎస్‌ఈసీ ఏకపక్ష నిర్ణయం..
ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను తీరును మంత్రి సురేష్ తప్పుబట్టారు. న్యాయవ్యవస్థ ఇస్తున్న సూచనలు నిమ్మగడ్డ రమేష్‌కుమార్ పాటించరా? అని ప్రశ్నించారు. ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని, ఎవరి కోసం ఎన్నికలు నిర్వహిస్తున్నారో నిమ్మగడ్డ జవాబు చెప్పాలని ఆదిమూలపు సురేష్ డిమాండ్ చేశారు. (చదవండి: ఎస్‌ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం పిటిషన్)
Comments
Please login to add a commentAdd a comment