
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): విద్యార్థులకు పట్టాతో పాటు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృషిచేస్తున్నారని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ కె.హేమచంద్రారెడ్డి తెలిపారు. కాకినాడలోని జేఎన్‌టీయూకే వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ మైక్రోసాఫ్ట్ ద్వారా 24 వేల మందికి ఇంటర్న్‌షిప్ నిర్వహించి సర్టిఫికెట్లు అందించినట్టు తెలిపారు. ఉన్నత విద్యలో పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టామని, వర్సిటీల్లో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు ఏర్పాటుచేసి నైపుణ్యాలు పెంచుతున్నట్టు తెలిపారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలకు అడ్డంకులు తొలగిన నేపథ్యంలో భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఉన్నత విద్యలో పరీక్ష విధానం, మెథడాలజీ, బోధన పద్ధతులు, పాఠ్య ప్రణాళికలో తేవాల్సిన మార్పులపై దృష్టి సారించామన్నారు. ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో వస్తున్న మార్పులను కరిక్యులమ్‌లో భాగం చేయాలని హేమచంద్రారెడ్డి సూచించారు. అనంతరం వర్సిటీ వ్యవస్థాపక లోగోను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వీసీ డాక్టర్ జీవీఆర్ ప్రసాదరాజు, మాజీ వీసీ రామలింగరాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment