సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. సచివాలయం మొదటి బ్లాక్‌లోని మంత్రివర్గ సమావేశ మందిరంలో జరిగిన ఈ భేటీలో 57 అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే పలు కీలక అంశాలపై కేబినెట్ భేటీలో చర్చించి నిర్ణయాలు తీసుకుంది. రూ. 1.26 లక్షల కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
గ్రీన్ ఎనర్జీ లో రూ. 81 వేల కోట్ల పెట్టుబడుల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిన కేబినెట్.. 21వేల ఉద్యోగాలు కల్పించే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. వైఎస్సార్ చేయూత, దివ్యాంగులకు 4 శాతం ఉద్యోగాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్లు, భావనపాడు పోర్టు విస్తరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
చదవండి: (షి‘కారు’ వెనుక డీలర్లతో డీల్!)
Comments
Please login to add a commentAdd a comment