సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. రైతు భరోసా పథకం, ఇన్‌పుట్ సబ్సిడీ నేరుగా ఆర్టీజీఎస్ ద్వారా చెల్లింపులు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇళ్ల పట్టాల పంపిణీ, పక్కా ఇళ్ల నిర్మాణంపై చర్చ జరగడంతో పాటు, ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కార్పొరేషన్ ఏర్పాటు ఆర్డినెన్స్‌కు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఏపీ సర్వే అండ్ బౌండరీ చట్ట సవరణ, ఆంధ్రప్రదేశ్ పర్యాటక పాలసీని కేబినెట్ ఆమోదించింది. 6 జిల్లాల్లో వాటర్‌షెడ్ల అభివృద్ధి పథకం అమలుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. (చదవండి: దేశంలో కొత్త చరిత్రకు శ్రీకారం)
మంత్రి మండలి భేటీ నిర్ణయాలు..
♦ఈ వ్యవసాయ సీజన్‌కు సంబంధించిన మూడో విడత రైతు భరోసా అమలుకు కేబినెట్ ఆమోదం
♦ఒక్కో రైతు, కౌలురైతులకు రూ.2వేలు ఇవ్వనున్న ప్రభుత్వం
♦నేరుగా రైతుల ఖాతాల్లోకే పంపించనున్న ప్రభుత్వం
♦డిసెంబర్ 29న రైతుల ఖాతాల్లోకి పంపించనున్న ప్రభుత్వం
♦ఇదివరకు రెండు విడతుల్లో రూ.11,500 చొప్పున ఖాతాల్లో జమచేసిన ప్రభుత్వం
♦రైతు భరోసా కింద 50.47 లక్షల మందికి ప్రయోజనం
♦రూ.1009 కోట్లు నేరుగా వారి ఖాతాల్లోకి
నివర్ తుపాను బాధిత రైతులకు ఊరట కల్పించిన ప్రభుత్వం
♦ఇన్‌పుట్‌సబ్సిడీ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం
♦8,06,504 మంది రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ
♦13.01 లక్షల ఎకరాలకు ఇన్‌పుట్ సబ్సిడీ
♦రూ.718 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వనున్న ప్రభుత్వం
♦డిసెంబర్ 29నే ఇన్‌పుట్ సబ్సిడీని కూడా ఇవ్వనున్న ప్రభుత్వం
♦పశుసంవర్థక, పాడిపరిశ్రమాభివృద్ధిశాఖలో కాంట్రాక్ట్ విధానంలో 147 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు, అదే సంఖ్యలో ల్యాబ్ అసిస్టెంట్స్ పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం
♦నియోజకవర్గాల స్థాయిలో పశువ్యాధి నిర్ధారణకు పరీక్షా కేంద్రాల్లో వీరిని నియమించనున్న ప్రభుత్వం
♦పులివెందులలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్ మెంట్ (ఇర్మా)– ఏపీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం
♦ఏపీ కార్ల్‌లో ఇర్మా–ఏపీ రూ.83.59 కోట్లతో ఏర్పాటు
♦ఈనెల 24న శంకుస్థాపన
♦గ్రామీణ మహిళలు, యువతలో సాధికారితను పెంచేలా కార్యక్రమాలు
♦వచ్చే ఏడాది మే, జూన్ నెలల నుంచి సర్టిఫికెట్ కోర్సులను ప్రారంభించేలా ప్రణాళిక
♦ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ కార్పొరేషన్ (ఏపీఎంఈఆర్‌సీ) ఏర్పాటుపై ఆర్డినెన్స్ జారీకి కేబినెట్ ఆమోదం
♦ప్రస్తుతం ఉన్న ఆస్పత్రులు, నర్సింగ్ కాలేజీలను బలోపేతం చేసే చర్యల్లో భాగంగా కార్పొరేషన్ ఏర్పాటు
♦కొత్త వైద్య కళాశాలలు, ఆస్పత్రుల నిర్మాణాలు చేపట్టనున్న కార్పొరేషన్
♦డిసెంబర్ 21 నుంచి సమగ్ర భూ సర్వేకు కేబినెట్ ఆమోదం
♦ఈ మేరకు 1923 నాటి ఆంధ్రప్రదేశ్ సర్వే మరియు బౌండరీల చట్టంలో కొన్ని సవరణలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్.
♦సర్వే ట్రైనింగ్ కాలేజీకోసం చిత్తూరుజిల్లా తిరుపతి అర్బన్ మండలంలోని చెన్నయ్యగుంట గ్రామంలో 41.19 ఎకరాల భూమిని ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం
♦ప్రభుత్వ ఆధీనంలో కాలేజీ ఏర్పాటు
♦పప్పుదినుసులు, తృణధాన్యాల పరిశోధన కోసం ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలం చినపావని గ్రామంలో 410.30 ఎకరాల భూమిని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అప్పగించేందుకు కేబినెట్ ఆమోదం
♦కర్నూలుజిల్లా అవుకు మండలం సుంకేసుల వద్ద 11.83 ఎకరాల భూమిని అటవీశాఖకు అప్పగించేందుకు కేబినెట్ ఆమోదం
♦కోవిడ్ కారణంగా సంక్షోభంలో ఉన్న టూరిజం రంగాన్ని ఆదుకునేందుకు తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం
♦దీనికోసం రీస్టార్ట్ ప్యాకేజీకి కేబినెట్ ఆమోదం
♦హోటళ్లకు, ఫంక్షన్ హాళ్లకు, సర్వీసు ప్రొవైడర్లకు, రెస్టారెంట్లకు మొత్తంగా 3910 యూనిట్లకు వర్తించనున్న రీస్టార్ట్ ప్యాకేజీ
♦రూ.50 వేల నుంచి గరిష్టంగా రూ.15 లక్షల వరకూ ఒక్కో యూనిట్‌కు రుణ సదుపాయం
♦రూ. 198.5 కోట్ల రూపాయల రీస్టార్ట్ ప్యాకేజీకి మంత్రి వర్గం అంగీకారం
ఏపీలో టూరిజం రంగం అభివృద్ధికోసం రూపొందించిన పాలసీకి కేబినెట్ ఆమోదం
♦భారీ ఎత్తున పెట్టుబడులు ఆహ్వానించేలా, అందుకు తగిన విధంగా వారిని ప్రొత్సహించే దిశగా పాలసీ
♦కొత్తగా వచ్చే టూరిజం యూనిట్లకు నెట్ ఎస్‌జీఎస్టీలో 100 శాతం రీయింబర్స్‌మెంట్.
♦ఐదేళ్లపాటు యూనిట్ కరెంటు రూ.2లకే
♦స్టాంపు డ్యూటీలో 100 శాతం రియింబర్స్‌మెంట్
♦ల్యాండ్ యూజ్ కన్వెర్షన్ ఛార్జీల్లో 100 శాతం మాఫీ
♦రూ. 400 కోట్లు పెట్టుబడి పెడితే దాన్ని మోగా టూరిజం ప్రాజెక్ట్‌గా పరిగణిస్తారు
♦ఏర్పాటుచేస్తున్న కొత్త మెగా టూరిజం యూనిట్లలో ఫైవ్‌స్టార్ పైబడి హోదా ఉన్నవారు పార్టనర్‌గా ఉండాలి
♦లీజు పీరియడ్‌ను 33 ఏళ్లనుంచి 99 సంవత్సరాలకు పెంపు
♦చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్‌కు నాబార్డ్ నుంచి రూ.1931 కోట్ల రూపాయల రుణం తెచ్చుకునేందుకు కేబినెట్ ఆమోదం
♦పులివెందుల బ్రాంచ్ కెనాల్, సీబీఆర్ రైట్ కెనాల్ ఫేజ్–2, కింద మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం
♦ఆరుజిల్లాల్లో రివార్డ్ కార్యక్రమం కింద వాటర్‌షెడ్ల అభివృద్ధికి కేబినెట్ ఆమోదం
♦ఏపీ అడిషనల్ అడ్వకేట్ జనరల్‌గా జాస్తి నాగభూషన్ నియామకానికి కేబినెట్ ఆమోదం
సినీ పరిశ్రమకు ఊరటనిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం
♦కరోనా కారణంగా దెబ్బతిన్న పరిశ్రమకు చేయూతనిచ్చేలా నిర్ణయాలు
♦3 నెలలపాటు థియేటర్లు చెల్లించాల్సిన ఫిక్స్‌డ్ ఎలక్ట్రిసిటీ ఛార్జీలు రద్దు
♦ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి మల్టీప్లెక్స్‌లు సహా, అన్ని థియేటర్లకూ ఫిక్స్‌డ్ ఎలక్ట్రిసిటీ ఛార్జీలు రద్దు
♦నెలకు రూ.3 కోట్ల రూపాయల చొప్పున భరించనున్న ప్రభుత్వం
♦మిగిలిన ఆరు నెలలు ఫిక్స్‌డ్‌ఛార్జీలు చెల్లింపును వాయిదా వేసేలా నిర్ణయానికి కేబినెట్ ఆమోదం
♦రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1100 థియేటర్లకు లబ్ధి
♦రీస్టార్ట్ ప్యాకేజీకింద వర్కింగ్‌క్యాపిటల్ రుణాలు
♦ఏ, బి, సెంటర్లలో థియేటర్లకు రూ.10లక్షల చొప్పున, సి– సెంటర్లలో ఉన్న థియేటర్లకు రూ. 5లక్షల చొప్పున రుణాలు
♦వాయిదాల చెల్లింపుపై 6 నెలల మారటోరియం, తర్వాత ఏడాది నుంచి నాలుగున్నర శాతం వడ్డీనికి భరించనున్న రాష్ట్ర ప్రభుత్వం
♦దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రూ.4.18 కోట్ల భారం
Comments
Please login to add a commentAdd a comment