సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతుపవనాలు అరేబియా సముద్రం, గుజరాత్‌లోని మరికొన్ని ప్రాంతాల్లోకి, మహారాష్ట్రలోని మిగిలిన భాగాలు, మధ్యప్రదేశ్–ఛత్తీస్‌గడ్‌లోని మరికొన్ని భాగాలు, ఒడిశాలోని మిగిలిన భాగాలు.. జార్ఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించాయి. రానున్న మూడు, నాలుగు రోజుల్లో ఉత్తర అరేబియా సముద్రం, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్‌లోని మిగిలిన భాగాల్లోకి ప్రవేశించనున్నాయి. దేశమంతటా రుతుపవనాలు విస్తరించేందుకు అనుకూల వాతావరణం ఏర్పడింది.
ఈ కారణంగా.. రాష్ట్ర వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. క్రమంగా కోస్తా, రాయలసీమల్లో వానలు విస్తరించే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. నైరుతి ప్రభావంతో.. నేటి నుంచి రాష్ట్రంలో అక్కడక్కడా వానలు కురిసే అవకాశాలున్నాయి. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమల్లో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటినుంచి మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిమీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశాలున్నాయని అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment