సాక్షి, ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్‌లో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం, వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని జాతీయ జెండా ఆవిష్కరించి.. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పొట్టి శ్రీ రాములు చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ వేడుకల్లో మంత్రి తానేటి వనిత, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బాయి చౌదరి, కలెక్టర్ రేవు ముత్యాలు రాజు, ఎస్పీ నారాయణ నాయక్, జాయింట్ కలెక్టర్లు వెంకట రమణా రెడ్డి, తేజ్ భరత్, ఆర్డీవో పనబాక రచన తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రులు ఆళ్ల నాని, తానేటి వనితా మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు పూర్వ వైభవం తీసుకువచ్చారని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా నవంబర్ 1న ఏపీ అవతరణ దినోత్సవం జరపాలని నిర్ణయించారని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment