
సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 45-60 ఏళ్ల వయసు మహిళలకు ఆర్థిక సాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వైఎస్సార్ చేయూత పథకంపై సోమవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ (ఏజీ) శ్రీరాం వాదనలు వినిపించారు. వైఎస్సార్ చేయూత అనేది రాష్ట్ర ఆర్థిక విధానం. ఆర్థిక సమర్థతకు సంబంధించిన అంశాల్లో ఒకటి.. ఈ వ్యవహారంలో కోర్టులకు ఉండే పాత్ర పరిమితం అన్నారు శ్రీరాం. (చదవండి: Andhra Pradesh: వెనకబాటు నుంచి వెన్నెముకగా..!)
పెద్ద సంఖ్యలో మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. వరుసగా నాలుగేళ్ల పాటు వాళ్ల చేతికే డబ్బు అందుతుంది. పథకం అమల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టంగా ఉన్నారు. అర్హులైన అందరికీ పథకం అందించాలన్నదే విధానం. ఈ విషయంలో తరతమ బేధం చూపరాదని సీఎం జగన్ స్పష్టం చేశారు అని ఏజీ శ్రీరాం కోర్టుకు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment