సాక్షి, అమరావతి : సంక్రాంతి సందర్భంగా 9వ తేదీ నుంచి 17 వరకు హైకోర్టుకు సెలవులు ప్రకటించారు. ఈ నెల 18న హైకోర్టు పునః ప్రారంభమవుతుంది. ఈ సెలవుల కాలంలో అత్యవసర కేసులను విచారించేందుకు వెకేషన్ కోర్టు పనిచేస్తుంది. వెకేషన్ కోర్టులో న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి, జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్‌లు ఉంటారు.
జస్టిస్ దేవానంద్, జస్టిస్ కృపాసాగర్ ధర్మాసనంలో, జస్టిస్ సుబ్బారెడ్డి సింగిల్ జడ్జిగా కేసులను విచారిస్తారు. అత్యవసర పిటిషన్లు దాఖలు చేయాలనుకునే వారు ఈ నెల 10న దాఖలు చేయాల్సి ఉంటుంది. వాటిపై న్యాయమూర్తులు ఈ నెల 12న విచారణ జరుపుతారు. హెబియస్ కార్పస్, ముందస్తు బెయిల్స్, కింది కోర్టులు తిరస్కరించిన బెయిల్ పిటిషన్లు, సెలవులు ముగిసేంత వరకు ఆగలేని అత్యవసర వ్యాజ్యాలు మాత్రమే ఈ వెకేషన్ కోర్టులో దాఖలు చేయాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment