
క్రెసిహెచ్‌ఆర్డీ చైర్మన్‌తో ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్న ఉన్నత విద్యామండలి అధికారులు
సాక్షి, అమరావతి: ఉన్నత విద్యారంగంలో వినూత్న కార్యక్రమాల అమలు ద్వారా విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టేందుకు ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. దీన్లో భాగంగా దక్షిణ కొరియాకు చెందిన సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ సోషల్ ఇంటిగ్రేషన్ అండ్ హెచ్‌ఆర్ డెవలప్‌మెంట్ (క్రెసిహెచ్‌ఆర్డీ), రాష్ట్ర ఉన్నత విద్యామండలి అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.
ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి సమక్షంలో బుధవారం క్రెసిహెచ్‌ఆర్డీ చైర్మన్ డాంగ్ యోప్ కిమ్, మండలి కార్యదర్శి ప్రొఫెసర్ సుధీర్ అవగాహన ఒప్పందం (ఎంవోయూ)పై సంతకం చేశారు. ఈ ఒప్పందం ద్వారా ఆరోగ్యకరమైన మానవ వనరులను సమాజానికి అందించడానికి అవకాశం కలుగుతుంది. విశ్వవిద్యాలయ పాఠ్యాంశాల్లో కొరియన్ లాంగ్వేజ్, విదేశీ విశ్వవిద్యాలయ మార్పిడి కార్యక్రమాలు, పరిశ్రమ ఇంటర్న్‌షిప్‌లు కూడా ఎంవోయూలో భాగంగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment