
అంబులెన్స్‌లను ప్రారంభిస్తున్న మంత్రి పేర్ని నాని, ఏపీఐఐసీ చైర్‌పర్సన్ ఆర్కే రోజా తదితరులు
మంగళగిరి: ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తీసుకుంటున్న పటిష్ట చర్యలతోనే కోవిడ్‌ను ఎదుర్కోవడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా ఉందని రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని, నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్‌పర్సన్ ఆర్కే రోజా పేర్కొన్నారు. గుంటూరు జిల్లా, మంగళగిరి పట్టణంలోని ఆటోనగర్‌లో ఉన్న ఏపీఐఐసీ కార్యాలయంలో జీ తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ చానల్ ఆధ్వర్యంలో పది అంబులెన్స్‌లు, నాలుగు వేల పీపీఈ కిట్లను మంగళవారం అందజేశారు.
ఆర్కే రోజా అంబులెన్స్ నడిపి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోశయ్య, వైఎస్సార్ ఆరోగ్య శ్రీ సీఈవో మల్లికార్జున, అడిషనల్ సీఈవో రాజశేఖర్‌రెడ్డి, 108 రాష్ట్ర ఆపరేషన్స్ హెడ్ సురేష్ కాంబ్లి, జీ టీవీ ప్రతినిధులు అనురాధ గూడూరు, సాయిప్రకాష్, శ్రీధర్ ములగద, ఉమాకాంత్ ముదిగొండ, వెంకటరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment