
సాక్షి, తిరుమల: తిరుమల లడ్డూ విషయంలో శ్రీవారి ఆలయం ముందు ప్రమాణం చేసేందుకు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సిద్ధమయ్యారు. ఈరోజు మధ్యాహ్నం 3:30గంటలకు ఆలయం వద్ద భూమన ప్రమాణం చేయనున్నారు.
తిరుమల ప్రసాదంపై చంద్రబాబు వ్యాఖ్యలను భూమన మొదటి నుంచి ఖండిస్తున్నారు. తన పదవీ కాలంలో ఎలాంటి పొరపాటు జరగలేదని నిరూపించుకునేందుకు భూమన సిద్ధమయ్యారు. ఈ క్రమంలో తిరుమల శ్రీవారి ఆలయం ముందు ప్రమాణం చేయడానికి భూమన తిరుమల వెళ్లనున్నారు.
ఈరోజు మధ్యాహ్నం ఆయన తిరుమల వెళ్లి పుష్కరిణీలో పవిత్ర స్నానం చేసి అఖిలాండం వద్ద కర్పూర నీరాజనం అందించనున్నారు. అనంతరం, స్వామి వారి ఆలయం ఎదుట భూమన ప్రమాణం చేయనున్నారు. మరోవైపు.. తన వ్యాఖ్యలపై శ్రీవారి ఎదుట ప్రమాణం చేయాలని వైస్సార్‌సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విసిరిన చాలెంజ్‌కు చంద్రబాబు ఇంతదాకా స్పందించకపోవడం గమనార్హం.
ఇది కూడా చదవండి: ‘బాబూ.. భక్తుల మనోభావాలతో ఆడుకుంటావా?’
Comments
Please login to add a commentAdd a comment