
చిలకలూరిపేట, నరసరావుపేట,
విజయవాడలలో 72 మంది బాధితులు
సీఐడీ అడిషనల్ ఎస్పీ సీహెచ్ ఆదినారాయణ వెల్లడి
నరసరావుపేటటౌన్: ఐసీఐసీఐ బ్యాంకులో రూ.28 కోట్ల కుంభకోణం జరిగినట్లు ప్రాథమికంగా తేలిందని సీఐడీ అడిషనల్ ఎస్పీ సీహెచ్ ఆదినారాయణ తెలిపారు. స్థానిక అరండల్‌పేటలోని ఐసీఐసీఐ బ్యాంకులో సోమవారం తనిఖీలు చేసింది. అనంతరం అడిషనల్ ఎస్పీ సీహెచ్ ఆదినారాయణ మీడియాతో మాట్లాడుతూ చిలకలూరిపేట, నరసరావుపేటతోపాటు విజయవాడలోని మూడు బ్రాంచ్‌లలో కలిపి సమారు రూ.28 కోట్ల కుంభకోణం జరిగినట్లు తేలిందన్నారు.
చిలకలూరిపేటలో 60మంది, నరసరావుపేటలో ఏడుగురు, విజయవాడలో ఐదుగురు... మొత్తం 72 మంది బాధితులు ఉన్నట్లు గుర్తించామని వివరించారు. ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇప్పటికే చిలకలూరిపేటలో 30 మంది, నరసరావుపేటలో ఐదుగురు బాధితుల నుంచి స్టేట్‌మెంట్ నమోదు చేశామన్నారు. తమతోపాటు బ్యాంకు అధికారులు కూడా ఈ కుంభకోణంపై శాఖాపరమైన విచారణ చేస్తున్నారని తెలిపారు.