సాక్షి, తాడేపల్లి: అమరావతిలో తప్పులు జరిగాయని తాము ముందు నుంచి చెప్తున్నామని మున్సిపల్‌శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘అమరావతి కుంభకోణాలపై క్యాబినెట్ సబ్‌కమిటీ వేశాం. సిట్ కూడా వేశాం. ఆ రోజు టీడీపీ వారు ఆధారాలు చూపండి అని అడిగారు. అందుకు సంబంధించిన ఆధారాలన్నీ ఏసీబీకి ఇచ్చాం. వారు కేసులు పెట్టారు. న్యాయస్థానం ఏవిధంగా స్టే ఇచ్చిందనే దానిపై నేను వ్యాఖ్యానించను. చంద్రబాబు, లోకేష్, వారి తాబేదారులు దీనిలో ఉన్నారు. ఎవర్నీ వదిలేది లేదు. మీరే దమ్ముంటే విచారణ చేయండి అన్నారు. మళ్లీ ఎందుకు కోర్టుకు వెళ్లారు..? అన్ని సాక్ష్యాలు, ఆధారాలు చూపుతున్నాం. (బోండా ఉమకు నిన్న సాయంత్రమే ఎలా తెలిసింది?)
సమస్యను పక్కదారి పట్టించాల్సిన అవసరం మాకేముంది. రాష్ట్రంలో సమస్య ఏముంది. దేశంలోనే మంచి పరిపాలన అందిస్తున్నాం. ప్రతి అంశంలో న్యాయపరంగా అవకాశాలన్నింటినీ వినియోగించుకుంటాము. ఏమీలేనప్పడు టీడీపీ వాళ్లు దేవుడ్ని దెయ్యాన్ని కూడా వదలరు. మేము సున్నిత అంశాలపై సరైన విధంగా స్పందిస్తున్నాం. మేము వచ్చిన తర్వాత ఆ రథాన్ని వాడలేదు. విచారణ చేసి బాధ్యులైన వారిపై తప్పక చర్య తీసుకుంటాం. ఆయన హయాంలో కిరీటాలు పోతే ఎందుకు మాట్లాడలేదు. మా ప్రభుత్వం ప్రతిదీ సీరియస్‌గా తీసుకుంటుంది. ఎవరైనా సరే ఉపేక్షించేది లేదు' అని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment