సాక్షి, విశాఖపట్నం : రాష్ట్ర సమగ్రాభివృద్ధి అధ్యయనం నేపథ్యంలో రవీంద్రనాథ్ అధ్యక్షతన ఏపీలోని 13 జిల్లాలో కమిటీ పర్యటిస్తుందని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన నివేదికను త్వరలోనే ప్రభుత్వానికి అందివ్వనుంది. కాగా, ఆ నివేదికలోనే రాజధాని అంశం కూడా ఇమిడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. రాజధాని పేరుతో భూములు కోల్పోయిన రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఆదుకుంటామని తెలిపారు.
ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాలను టీడీపీ సజావుగా జరగనివ్వడం లేదని మండిపడ్డారు. అసభ్య పదజాలంతో మార్షల్స్, ఉద్యోగులపై దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. చంద్రబాబుకు రోజురోజుకు అసహనం పెరిగిపోయి సహనం కోల్పోతున్నారని దుయ్యబట్టారు. ప్రజలు తప్పు చేశారని చంద్రబాబు భావిస్తున్నారు.. కానీ ఆయనే సజావుగా జరగాల్సిన సభను అడ్డుకొని తప్పు చేస్తున్నారని మండిపడ్డారు. కాగా, చంద్రబాబు పాలనలో రాష్ట్రమంతా అవినీతి కూపంగా తయారైందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైఎస్సార్ స్పూర్తితో అభివృద్ధి, సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. వచ్చే ఏడాది రాష్ట్రంలోని 109 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment