సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సోమవారం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించారు. అనంతరం బుగ్గన మీడియాతో మాట్లాడుతూ.. ‘కరోనా నేపథ్యంలో రాష్ట్రానికి త్వరగా నిధులు ఇవ్వాలని కోరాం. విభజన చట్టం ప్రకారం రావాల్సిన రెవెన్యూ లోటు పూరించాలని తెలిపాం. పోలవరంపై గత ప్రభుత్వ పొరపాట్లను సరి చేస్తున్నాం. పోలవరంపై చంద్రబాబు తప్పుడు ఒప్పందాలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు పోలవరం లైఫ్‌లైన్’ అన్నారు బుగ్గన. (చదవండి: 'చంద్రబాబు చిక్కుముడులు విప్పుతున్నాం')
అలానే ఎస్‌ఈసీ నిమ్మగడ్డకి వ్యతిరేకంగా ఏపీ హైకోర్టు వెల్లడించిన తీర్పు కరోనా వారియర్స్ విజయమన్నారు బుగ్గన. ప్రజల ప్రాణాలు ముఖ్యమా?.. ఎన్నికలు ముఖ్యమా అని ప్రశ్నించారు. ఆర్టికల్ 14, 21కి విరుద్ధంగా ఎన్నికల షెడ్యూల్ ఉందన్నారు.
(చదవండి: నిమ్మగడ్డకు షాక్! పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రద్దు)
Comments
Please login to add a commentAdd a comment