
సాక్షి, కర్నూలు: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు ప్రచారం చేయడమే చంద్రబాబు పని అంటూ తీవ్ర విమర్శలు చేశారు.
కాగా, మంత్రి బుగ్గన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎక్కడా దాడులు లేవు, అక్రమ కేసులు నమోదు కాలేదు. 2019 నుంచి రాష్ట్రంలో క్రైమ్ రేటు తగ్గింది. తప్పుడు ప్రచారం చేయడమే టీడీపీ పని. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చాము. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధిస్తుంది అని కామెంట్స్ చేశారు.