సాక్షి, అమరావతి: రబీ 2024–25 మార్కెటింగ్ సీజన్‌కు కనీస మద్దతు ధరలు నిర్ణయించేందుకు వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్ (సీఏసీపీ) దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సమావేశం విశాఖ పట్నంలో శుక్రవారం జరుగనుంది. సీఏసీపీ చైర్మన్ విజయ్‌పాల్ శర్మ అధ్యక్షతన విశాఖలోని పార్క్ హోటల్‌లో జరుగనున్న ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలైన అండమాన్ నికోబార్, పుదుచ్చేరి, లక్షద్వీప్ రాష్ట్రాలకు చెందిన వ్యవసాయ, ఉద్యాన శాఖ కమిషనర్లు, శాస్త్రవేత్తలు, నిపుణులు పాల్గొననున్నారు. ఆయారాష్ట్రాల్లో సాగవుతున్న వ్యవసాయ, ఉద్యాన పంటలకు ప్రస్తుతం ఉన్న కనీస మద్దతు ధరపైన ఖర్చులు, రాబడి వివరాలను కమిషన్ దృష్టికి తీసుకెళ్తారు.
రాబోయే సీజన్‌కు కనీస మద్దతు ధరలను నిర్ణయించి ముసాయిదా నివేదికను కమిషన్ కేంద్రానికి సమర్పిస్తుంది. కేంద్రం వీటిని అధ్యయనం చేసి ప్రతీ ఏటా వ్యవసాయ సీజన్ ప్రారంభానికి ముందే రైతులకు ప్రయోజనం చేకూర్చేలా కనీస మద్దతు ధరలను నిర్ణయించి ప్రకటిస్తుంది. రబీ పంట కాలానికి సంబంధించి ఆహార ధాన్యాల కింద గోధుమ, బార్లీ పంటలకు, అపరాల కిందశనగ, మెంతులుæ పంటలు, నూనెగింజల కింద ఆవాలు, కుసుమ పంటల ఉత్పాదక ఖర్చులను పరిగణనలోకి తీసుకుని కనీస మద్దతు ధరలను ఆయా రాష్ట్రాలు ప్రతిపాదిస్తాయి.
ఏపీలో అపరాల పంటలలో ఎక్కువగా సాగయ్యే శనగ పంటతో పాటు నూనెగింజలలో ఒకటైన ఆవాలకు కనీస మద్దతు ధరలకు ప్రతిపాదనలు పంపాల్సిందిగా సీఏసీపీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. రబీ–2022–23 మార్కెటింగ్ సీజన్‌లో శనగ పంటకు క్వింటాల్ రూ.5,230, ఆవాలకు రూ.5,050గా ప్రకటించారు. అయితే ప్రస్తుతం పెరిగిన పెట్టుబడి ఖర్చులు, రాబడిని దృష్టిలో పెట్టుకుని రబీ 2024–25 మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి శనగ పంట ఉత్పత్తులకు క్వింటాల్‌కు రూ.7,983లుగా, ఆవాలు క్వింటాల్‌కు రూ.6,608 చొప్పున పెంచి కనీస మద్దతు ధరగా నిర్ణయించాలని రాష్ట్ర ప్రభుత్వం కమిషన్‌కు నివేదిక సమర్పించనుంది. మిగిలిన రాష్ట్రాలు కూడా తమకు కేటాయించిన పంట ఉత్పత్తులకు సంబంధించిన ప్రతిపాదనలను కమిషన్‌కు సమర్పించనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment