
సాక్షి, చిత్తూరు: ఎద్దులు కొనేందుకు కూడా ఆర్థిక స్థోమత లేక ఇబ్బందులు పడుతున్న కేవిపల్లి మండలం మహల్‌కు చెందిన రైతు నాగేశ్వర్‌రావు పరిస్థితి సోనూ సూద్ సాయంతో మారిపోయింది. సోనూ సూద్ దాతృత్వంతో ఆ రైతు ట్రాక్టర్‌ను సాయంగా పొందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి నాగేశ్వర్‌రావు పొందిన లబ్దిపై కూడా చర్చకు వచ్చింది. రైతు సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో అందరి మాదిరిగానే నాగేశ్వర్‌రావు కూడా లబ్ది పొందారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అతనికి అందిన సహాయం వివరాలు...
(చదవండి: సోనూ.. నువ్వు సూపర్)
1. గత ఏడాది రైతు భరోసా కింద రూ.13,500 నేరుగా నాగేశ్వర్‌రావు ఖాతాలో జమ చేసిన ప్రభుత్వం
2. ఈ ఏడాది రైతు భరోసాలో భాగంగా ఇప్పటివరకూ రూ.7500 బదిలీ. మిగతా మొత్తం అక్టోబరు, జనవరిలో బదిలీ
3. నాగేశ్వర్‌రావు చిన్న కుమార్తెకు ‘జగనన్న అమ్మ ఒడి’ కింద గత జనవరిలో రూ.15,000 అందించిన ప్రభుత్వం
4. పెద్ద కూతురుకు ‘జగనన్న తోడు’ కింద లబ్ధికోసం దరఖాస్తు. చిరు వ్యాపారులకోసం ప్రభుత్వం వడ్డీలేని ఆర్థిక సహాయం ఈ పథకం కింద అందిస్తోంది.
5. నాగేశ్వర్‌రావు తల్లి అభయహస్తం కింద పెన్షన్ అందుకుంటోంది.
6. నాగేశ్వర్‌రావు తండ్రి వృద్ధాప్య పెన్షన్ కింద ప్రతి నెలా రూ.2250 అందుకుంటున్నారు.
7. కరోనా సమయంలో పేద కుటుంబాలను ఆదుకునేందుకు ప్రతి కుటుంబానికి అందించిన రూ.1000 సహాయాన్ని నాగేశ్వర్‌రావు కుటుంబం పొందింది. ఉచిత రేషన్ కూడా తీసుకుంది.
8. తనకున్న 2 ఎకరాల పొలంలో వేరు శెనగ వేయడానికి రైతు భరోసా కేంద్రం నుంచి డీఏపీ ఎరువు, విత్తనాలను నాగేశ్వర్‌రావు తీసుకున్నారు.
(సినీ, రాజకీయ ప్రముఖులే జలసీ ఫీలయ్యేంత..)
Comments
Please login to add a commentAdd a comment