
సాక్షి, అమరావతి: ఈ నెల 20 నుంచి ప్రధాన నగరాల్లో సిటీ బస్సు సర్వీసులు నడిపేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 20 నుంచి 26 వరకు గ్రామ/వార్డు సచివాలయ పోస్టుల రాతపరీక్షలు ఉండడంతో అభ్యర్థులకు రవాణా సౌకర్యం కల్పించాల్సి ఉంది. 10 లక్షల మంది పరీక్షలు రాస్తుండటంతో ఇందుకు తగ్గట్టుగా ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేశారు.
► రాష్ట్రంలో మే 21 నుంచి బస్సు సర్వీసులను ప్రారంభించిన సంగతి తెలిసిందే.
► అప్పటి నుంచి అన్ని జిల్లాల్లో రోజూ 3 వేలకు పైగా సర్వీసులను తిప్పుతూ 3.50 లక్షల మందిని ఆర్టీసీ చేరవేస్తోంది.
► అయితే విజయవాడ, విశాఖపట్నంలలో సిటీ బస్సు సర్వీసులను ప్రారంభించలేదు.
► సచివాలయ ఉద్యోగాలకు పరీక్షల నేపథ్యంలో హెల్త్ ప్రొటోకాల్ ప్రకారం సిటీ బస్సు సర్వీసులు నడిపేందుకు ఏపీఎస్‌ఆర్టీసీ ప్రణాళిక సిద్ధం చేసి వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి అనుమతి కోసం ఫైల్‌ను పంపింది. ఆయన, సీఎస్ నీలం సాహ్ని నిర్ణయం తీసుకుని సిటీ బస్సు సర్వీసులకు అనుమతి ఇస్తారని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment