Breadcrumb
సీమసిగలో మెగా పవర్ ప్రాజెక్ట్.. సీఎం జగన్ చేతులమీదుగా శంకుస్థాపన
Published Tue, May 17 2022 8:43 AM | Last Updated on Tue, May 17 2022 3:39 PM
Live Updates
కర్నూలు జిల్లాలో సీఎం జగన్ పర్యటన
ఇది గర్వించదగిన విషయం: సీఎం జగన్
ప్రపంచంలోనే తొలి ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మంగళశారం శంకుస్థాపన చేశారు. అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ.. కర్నూలులో హైడల్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయడం సంతోషం. ప్రపంచంలోనే తొలి హైడల్ పవర్ ప్లాంట్‌కు కర్నూలు వేదికవడం గర్వకారణమని సీఎం జగన్ అన్నారు.
'ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు కోసం గ్రీన్కో ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.15 వేల కోట్ల పెట్టుబడి పెట్టబోతోంది. ఈ ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని నిరుద్యోగులకు భారీగా ఉపాధి, ఉద్యోగావకాశాలు రానున్నాయి. హైడల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో 15 వేల ఉద్యోగాలొస్తాయి. ఐదేళ్ల పాటు నిర్మాణ పనులు కొనసాగుతాయి. తరువాత ప్రత్యక్షంగా 3 వేల మందికి.. పరోక్షంగా మరో 5 వేల మంది ఉపాధి పొందుతారు' అని సీఎం జగన్ అన్నారు.
సీమసిగలో మెగా పవర్ ప్రాజెక్ట్.. సీఎం జగన్ చేతులమీదుగా శంకుస్థాపన
రాబోయే 5 ఏళ్లలో పూర్తి
మొత్తం 5,410 మెగా వాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి నేషనల్ గ్రిడ్‌కు అనుసంధానించి ఓరక్వల్లు పీజీసీఐఎల్/సీటీయూ విద్యుత్ సబ్ స్టేషన్ ద్వారా దేశంలోని డిస్కామ్‌లు, పరిశ్రమలకు విద్యుత్ సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని రాబోయే 5 ఏళ్లలో పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తారు. రూ.15 వేల కోట్ల పెట్టుబడితో స్థాపించే ఈ పవర్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసుకుంటే 23 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాల లభిస్తాయి. అంతేకాక స్థానికంగా ఉన్న పరిశ్రమలు, హోటళ్లలో విద్యుత్ కోతలకు చెక్ పెట్టవచ్చు.
ప్రపంచంలోనే అత్యధికంగా విద్యుత్ ఉత్పత్తి
గ్రీన్కో ఎనర్జీస్ లిమిటెడ్ ఏర్పాటు చేస్తున్న ఈ ప్రాజెక్టు ప్రపంచంలోనే అత్యధికంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేయనుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం 4,766.28 ఎకరాల భూమిని కేటాయించింది. ఇప్పటికే 2,800 ఎకరాలను కంపెనీకి అప్పగించింది. ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులో భాగంగా సోలార్ విద్యుత్ ఉత్పత్తి 3000 మెగావాట్లు, విండ్ 550 మెగావాట్లు, హైడల్ పవర్ 1860 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తారు.
ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
ప్రపంచంలోనే తొలి ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుకు కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం గుమ్మితం తాండాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అంకురార్పణ చేశారు. అంతకు ముందు అక్కడ ఏర్పాటు చేసిన ఓ పైలాన్‌ను సీఎం జగన్ ఆవిష్కరించారు.
త్రీడీ మోడల్ నమూనాను ప్రారంభించిన సీఎం జగన్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓర్వకల్లు మండలం గుమ్మితం తాండాలో పవర్ ప్రాజెక్ట్ త్రీడీ మోడల్ నమూనాను ప్రారంభించారు. ఒకే యూనిట్ నుంచి సోలార్, విండ్, హైడల్ పవర్లను ఉత్పత్తి చేయడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. ఈ ప్రాజెక్ట్ ద్వారా 5,230 మెగావాట్ల ఉత్పత్తి చేస్తారు.
ఓర్వకల్లు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నసీఎం జగన్
కర్నూలు: ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డి కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. అక్కడ నుంచి హెలీకాప్టర్‌లో ప్రపంచంలోనే మొట్టమొదటి రెన్యువబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేస్తోన్న గుమ్మటం తాండాకు పయనమయ్యారు.
కర్నూలు పర్యటనకు బయల్దేరిన సీఎం జగన్
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కర్నూల్ జిల్లా పాణ్యం బయలుదేరారు. గ్రీన్కో పునరుత్పాదనక విద్యుత్ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేయనున్నారు. ఓర్వకల్లు మండలం గుమ్మితం తండా, పాణ్యం మండలం పిన్నాపురంలలో గ్రీన్కో ఎనర్జీస్ లిమిటెడ్ ఈ ప్లాంట్‌ను నెలకొల్పొతుంది. ఒకే యూనిట్ నుంచి సోలార్, విండ్, హైడల్ పవర్లను ఉత్పత్తి చేయడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత.
రూ.15వేల కోట్ల ప్రాజెక్టుకు సీఎం జగన్ శంకుస్థాపన
ప్రభుత్వ ఆధ్వర్యంలో 33,240 మెగావాట్ల ప్రాజెక్టులు
ప్రైవేటుతో పాటు ప్రభుత్వ ఆధ్వర్యంలోనూ 33,240 మెగావాట్ల భారీ సామర్థ్యంతో పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోంది. వివిధ జిల్లాల్లో అందుబాటులో ఉండే నీటి వనరులను ఉపయోగించుకుని పంప్డ్ హైడ్రో స్టోరేజీ, సౌర, పవన విద్యుత్‌ల కలయికగా ఈ అధునాతన ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తోంది.
రాష్ట్రంలో మొత్తం 29 చోట్ల వీటిని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా.. మొదటి దశలో గండికోట, చిత్రావతి, సోమశిల, ఓక్, కురుకుట్టి, కర్రివలస, యర్రవరంలో శ్రీకారం చుడుతోంది. మొత్తం ఏడుచోట్ల 6,600 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించే ఈ ప్రాజెక్టుల డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) తయారవుతోంది.
15 మిలియన్ టన్నుల CO2 తగ్గుతుందని కంపెనీ అంచనా
ఇక పిన్నాపురంలో స్థాపిస్తున్న ఈ ప్రాజెక్టు కారణంగా, వాతావరణంలో ఏటా కార్బన్ డయా క్సైడ్ 15 మిలియన్ టన్నులు తగ్గుతుందని కంపెనీ అంచనా. 50 లక్షల పెట్రోల్, డీజిల్ కార్ల బదులుగా ఎలక్ట్రిక్ కార్లను ఉపయోగిస్తే, లేదా 25 లక్షల హెక్టార్ల భూమిలో అడవిని పెంచితే వాతావరణంలో ఎంత కార్బన్ డయాౖక్సైడ్ తగ్గుతుందో ఈ ప్రాజెక్టు ద్వారా అంత తగ్గుతుందని కంపెనీ చెబుతోంది.
రూ.15వేల కోట్ల పెట్టుబడి..
ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు కోసం గ్రీన్కో ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.15 వేల కోట్ల పెట్టుబడి పెట్టబోతోంది. ఈ ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని నిరుద్యోగులకు భారీగా ఉపాధి, ఉద్యోగావకాశాలు రానున్నాయి. హైడల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో 15 వేల ఉద్యోగాలొస్తాయి. ఐదేళ్ల పాటు నిర్మాణ పనులు కొనసాగుతాయి. తరువాత ప్రత్యక్షంగా 3 వేల మందికి.. పరోక్షంగా మరో 5 వేల మంది ఉపాధి పొందుతారు. ఇక్కడ విద్యుదుత్పత్తి ప్రారంభమైతే విద్యుత్ కష్టాలు కొంతవరకు తీరుతాయి.
కర్నూలులో తొలి హైడల్ పవర్ ప్రాజెక్టు
ఇంటిగ్రేటేడ్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులో భాగంగా కర్నూలులో తొలి హైడల్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు కాబోతోంది. 1,680 మెగావాట్ల విద్యుదుత్పత్తి అయ్యే హైడల్ వపర్‌ను పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ అని కూడా అంటారు. హైడల్ పవర్‌ను పెద్దపెద్ద సాగునీటి ప్రాజెక్టుల్లో మాత్రమే చేపట్టేందుకు వీలుంటుంది. అయితే, కేటాయించిన స్థలంలో పైన, కింద ప్రాజెక్టులు కడతారు.
విద్యుత్ వాడకానికి డిమాండ్ లేని సమయంలో నీటిని కింది నుంచి పైకి పంప్ చేస్తారు. విద్యుత్ వాడకం ఎక్కువగా ఉన్న సమయంలో పైనున్న నీటిని కిందికి వదిలి టర్బైన్ల ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తారు. అందువలన దీనిని పంప్డ్ స్టోరేజ్ పవర్ లేదా హైడల్ పవర్ అంటారు. ఇక ఈ ప్రాజెక్టు కోసం గోరుకల్లు రిజర్వాయర్ నుంచి ఒక టీఎంసీ నీటిని కేటాయించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను జారీచేసింది.
23 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి
మొత్తం 5,410 మెగా వాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి నేషనల్ గ్రిడ్‌కు అనుసంధానించి ఓరక్వల్లు పీజీసీఐఎల్/సీటీయూ విద్యుత్ సబ్ స్టేషన్ ద్వారా దేశంలోని డిస్కామ్‌లు, పరిశ్రమలకు విద్యుత్ సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని రాబోయే 5 ఏళ్లలో పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తారు. రూ.15 వేల కోట్ల పెట్టుబడితో స్థాపించే ఈ పవర్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసుకుంటే 23 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాల లభిస్తాయి. అంతేకాక స్థానికంగా ఉన్న పరిశ్రమలు, హోటళ్లలో విద్యుత్ కోతలకు చెక్ పెట్టవచ్చు.
ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్న సీఎం జగన్
కర్నూలు(సెంట్రల్): ప్రపంచంలోనే తొలి ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుకు కర్నూలు జిల్లా వేదిక కానున్నది. ఓర్వకల్లు మండలం గుమ్మితం తండా, పాణ్యం మండలం పిన్నాపురంలలో గ్రీన్కో ఎనర్జీస్ లిమిటెడ్ ఈ ప్లాంట్‌ను నెలకొల్పొతుంది. ఒకే యూనిట్ నుంచి సోలార్, విండ్, హైడల్ పవర్లను ఉత్పత్తి చేయడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ప్రతిష్టాత్మక ఈ ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు.
Related News By Category
Related News By Tags
-
కర్నూలు జిల్లాలో టీడీపీ కూటమికి భారీ షాక్
సాక్షి, పల్నాడు జిల్లా: మాటపై నిలబడే నాయకుని నాయకత్వంలో పని చేయడానికి వైఎస్సార్సీపీలో చేరేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపుతున్నారు. కార్యకర్తల మనోభావాలను పరిగణనలోకి తీసుకున...
-
కదం తొక్కిన స్టార్ క్యాంపెయినర్లు
4 వ రోజు స్టార్ క్యాంపెయినర్లతోసీఎం వైఎస్ జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా నాలుగో రోజైన శనివారం కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పర్యటించిన సీఎం వైఎస్ జగన్ పలు ఫొటోలను ట్వీట్ చేశారు. ‘నాల...
-
పల్లెల్లో అపూర్వ ఆదరణ
కర్నూలు (సెంట్రల్): మేమంతా సిద్ధం బస్సు యాత్రకు కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో అపూర్వ ఆదరణ లభించింది. సీఎం జగన్ రాక కోసం ఉదయం నుంచి రాత్రి వరకు పల్లెలు ఎదురు చూశాయి. మూడో రోజు బస్సు యాత్ర కోడుమూరు,...
-
పేదల తలరాతలు మార్చే ఎన్నికలివి : సీఎం వైఎస్ జగన్
సాక్షి, నంద్యాల : వైఎస్సార్సీపీ 58నెలల పాలనలో గ్రామాల రూపురేఖలు సమూలంగా మారిపోయాయని, ఈ ఎన్నికలు పేదల తలరాతలను మార్చే ఎన్నికలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ‘ఇవాళ మన ప్రభుత్వ...
-
ప్రభం‘జనం’.. సీఎం జగన్ బస్సు యాత్రకు నీరాజనాలు
మేమంతా సిద్ధం బస్సు యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: జనం.. జగన్ కలిస్తే ప్రభంజనమేననే మరోసారి రుజువైంది. సార్వత్రిక ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస...
Comments
Please login to add a commentAdd a comment