
సాక్షి, అమరావతి: ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే ఉన్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. 2021-22 ఏడాదికి సంబంధించిన జాబ్ క్యాలెండర్‌ను శుక్రవారం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సీఎం మాట్లాడుతూ, ప్రత్యేక హోదా అంశాన్ని కూడా ప్రస్తావించారు. ప్యాకేజీ, ఓటుకు కోట్లు కేసు కోసం గత పాలకులు హోదాను తాకట్టు పెట్టారని సీఎం అన్నారు. గత ప్రభుత్వంలోని ఇద్దరు పెద్దలు కేంద్రమంత్రి పదవులు కూడా చేపట్టారని.. గత ప్రభుత్వం మాటలతో భ్రమ కల్పించిన విషయం అందరికీ తెలుసునని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రానికి మంచి జరుగుతుందని ఆశతో ఉన్నామని సీఎం వైఎస్ జగన్ అన్నారు.
చదవండి: ఏపీ: జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన సీఎం జగన్
‘చంద్రబాబు దొంగల ముఠా నాయకుడు’
Comments
Please login to add a commentAdd a comment