
పి.గన్నవరం,మామిడికుదురు: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘నాడు–నేడు’ కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారుల బృందాన్ని పంపించి నాడు–నేడుకు సంబంధించిన విధి విధానాలతో పాటు సాఫ్ట్‌వేర్‌ను కూడా తీసుకెళ్లిందని తెలిపారు. ఈ నెల 16వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరంలో ‘నాడు–నేడు’ రెండో విడత కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారని చెప్పారు.
కాగా, సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించేందుకు మంత్రులు సురేష్, కురసాల కన్నబాబు, పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన శ్రీనివాసవేణుగోపాలకృష్ణ, ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్ తలశిల రఘురామ్ బుధవారం పి.గన్నవరం వచ్చారు. జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్, ఎస్పీ ఎం.రవీంద్రనాథ్, పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు
Comments
Please login to add a commentAdd a comment