డీజీపీగా ద్వారకా తిరుమలరావు బాధ్యతల స్వీకరణ | Dwarka Tirumala Rao assumes charge as DGP | Sakshi
Sakshi News home page

డీజీపీగా ద్వారకా తిరుమలరావు బాధ్యతల స్వీకరణ

Published Sat, Jun 22 2024 4:46 AM | Last Updated on Sat, Jun 22 2024 4:46 AM

Dwarka Tirumala Rao assumes charge as DGP

సాక్షి, అమరావతి/ఇంద్రకీలాద్రి­(విజయవాడ­పశ్చిమ): డీజీపీగా సీహెచ్‌.ద్వారకా తిరుమలరావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయానికి చేరుకున్న ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. 

ఈ సందర్భంగా డీజీపీకి పోలీసు ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలిపారు. అదనపు డీజీలు, ఐజీలు, ఇతర పోలీసు ఉన్నతాధికారులతో ద్వారకా తిరుమలరావు కాసేపు సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.  

పోలీసు అధికారుల సంఘం శుభాకాంక్షలు
డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన ద్వారకా తిరుమలరావుకు రాష్ట్ర పోలీసు అధికారుల  సంఘం శుభాకాంక్షలు తెలిపింది. మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో డీజీపీతో పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. 

సమర్థుడైన పోలీసు అధికారిగా గుర్తింపు పొందిన ఆయన రాష్ట్రంలో డీజీపీగానూ విజయవంతమవుతారని ఆకాంక్షించారు. పోలీసుల సంక్షేమం కోసం కృషి చేయాలని ఆయన్ని కోరారు. కాగా, డీజీపీ ద్వారకా తిరుమలరావు దంపతులు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement