సాక్షి అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకొంటున్న ప్రత్యేక శ్రద్ధతో మన విద్యారంగం పలు రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు పునాదులు బలంగా మారుతున్నాయి. ముఖ్యంగా ప్రతి ఉన్నత విద్యా సంస్థ అత్యున్నత ప్రమాణాలతో న్యాక్, ఎన్బీఏ, ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకులను సాధించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
వర్సిటీల్లో, కాలేజీల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచింది. దశాబ్దాలుగా భర్తీ కాని డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్ పోస్టులను భర్తీ చేశారు. గతంలో చంద్రబాబు హయాంలో వర్సిటీలలో అధ్యాపక పోస్టుల నియామకాల్లో పలు అక్రమాలు చోటు చేసుకున్నాయి. యూజీసీ నిబంధనలకు వ్యతిరేకంగా, రోస్టర్ పాయింట్లలో అవకతవకలు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలకు పోస్టులు రాకుండా కుట్రలు చేశారు.
అక్రమాలతో పోస్టుల హేతుబద్ధీకరణ చేసి గత ఎన్నికల ముందు నోటిఫికేషన్లు ఇచ్చారు. వీటిపై పలువురు కోర్టులను ఆశ్రయించడంతో నియామకాలు గందరగోళంగా మారాయి. ఇప్పుడు ప్రభుత్వం ఈ పోస్టుల భర్తీకి ప్రయత్నాలు చేసినా కోర్టుల్లో కేసులు ఉండడంతో ఆటంకాలు తప్పడంలేదు. వాటిని పరిష్కరించి నియామకాలు చేపట్టేందుకు కోర్టు నుంచి సానుకూల ఆదేశాలు తీసుకుని ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే ఈనాడు యధాప్రకారం బురద చల్లుతోంది.
► ఉన్నత విద్యా వ్యవస్థలో కాలానుగుణంగా చోటు చేసుకునే మార్పులను అనుసరించి రేషనలైజేషన్‌కు యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్లకు పూర్తి అధికారాలున్నాయి. 2015లో ప్రొఫెసర్ రాఘవులు నేతృత్వంలో ఏర్పాటైన హైపవర్ కమిటీ సరైన విధానాలను పాటించకుండా రేషనలైజేషన్ ప్రక్రియ చేయటంతో కోర్టులో రిట్ పిటిషన్లు దాఖలై నియామకాలు చేపట్టలేని పరిస్థితులు నెలకొన్నాయి.
2018లో 1,711 పోస్టులు ఖాళీలు ఉండగా కేవలం 1,383 మాత్రమే భర్తీ చేయాలని గత ప్రభుత్వం ప్రతిపాదించినప్పుడు ఈనాడు ఏం చేస్తున్నట్లు? ఇప్పుడు విశ్వవిద్యాలయాల్లో 3,295 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే కడుపుమంట ఎందుకు? ఇవే కాకుండా ఆర్జీయూకేటీకి 420 పోస్టులు, వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి 138 పోస్టులు, జేఎన్టీయూ గురజాడ విజయనగరం యూనివర్సిటీకి 104 పోస్టులను అదనంగా మంజూరు చేయడం కనపడటం లేదా? ఇవేమీ కొత్త పోస్టులు కాదు.. సర్దుబాటే అనే తరహాలో ఎందుకీ విష ప్రచారం?
► హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలోని 16 యూనివర్సిటీలు రేషనలైజేషన్ ప్రక్రియ చేపట్టాయి. యూజీసీ నిబంధనలకు అనుగుణంగా వర్క్ లోడ్, కేడర్ రేషియో ఆధారంగా అధ్యాపక పోస్టుల అవసరాన్ని అంచనా వేశారు. ఈ ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహించాయి.
అడ్వైజరీ కమిటీ సహకారంతో రేషనలైజేషన్ ప్రతిపాదనలను ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్లలో ఆమోదించి ప్రభుత్వానికి అందచేశాయి. ఉన్నత విద్యా మండలి సలహాతో వివిధ వర్సిటీలకు ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది.
► ఆంధ్ర విశ్వవిద్యాలయానికి రేషనలైజేషన్ అనంతరం 726 పోస్టులను మంజూరు చేశారు. గతంలో వర్సిటీకి మంజూరైన 926 పోస్టులలో 200 అవసరం లేదని గుర్తించారు. దీనికి కారణాలేమిటంటే అధ్యాపకులు ఒక వారంలో ఎన్ని గంటల పాటు బోధించాలనే విషయంలో యూజీసీ 1996 తర్వాత మార్పులు చేసింది. దీంతో శాస్త్రీయంగా లెక్కించి ఖాళీలను భర్తీ చేస్తున్నారు.
అంతేగానీ ఆంధ్రా యూనివర్సిటీని తక్కువ చేయటం గానీవర్సిటీ అభివృద్ధికి ఆటంకం కలిగించేలా ఎలాంటి నిర్ణయాలనుగానీ తీసుకోలేదు. ఇక్కడ మిగిలిన పోస్టులను రాష్ట్రంలో ఇతర వర్సిటీలకు సర్దుబాటు చేస్తున్నారు. అదే విధంగా శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో 150 అధ్యాపక పోస్టుల విషయంలో హేతుబద్ధీకరణ జరిగింది.
► బ్యాక్ లాగ్ పోస్టులను ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా ఆయా వర్సిటీల్లో భర్తీ చేస్తారు. మూసివేసిన విభాగాలలో కూడా బ్యాక్ లాగ్ వేకెన్సీ ఉంటే ప్రస్తుత నిబంధనల ప్రకారం నింపుతారు.
మీ నిర్లక్ష్యంతోనే నవ్వుల పాలు!
Published Fri, Sep 8 2023 5:14 AM | Last Updated on Fri, Sep 15 2023 7:56 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment