
సాక్షి, వైఎస్సార్: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పులివెందుల పర్యటనలో ఉన్నారు. పులివెందులో వైఎస్ జగన్ ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఉల్లి రైతులు.. వైఎస్ జగన్‌ను కలిసి తమ ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం తమను ఆదుకోవడం లేదని చెప్పుకొచ్చారు.

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందుల పర్యటనలో ఉన్నారు. మూడోరోజు పర్యటనలో భాగంగా క్యాంపు ఆఫీసులో వైఎస్ జగన్ ప్రజాదర్బార్ ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ప్రజల నుంచి వచ్చిన వినతులను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో నేడు ఉల్లి రైతులు.. వైఎస జగన్‌ను కలిశారు. ఈ సందర్బంగా వారి కష్టాలను వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు.

రైతులు మాట్లాడుతూ..‘ఎకరాకు లక్ష పెట్టుబడి పెట్టినా కనీసం రవాణా చార్జీలు కూడా రాలేదన్నారు. తినడానికి తిండి కూడా లేక మార్కెట్ నుంచి వెనక్కి వచ్చేశామని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో, మద్దతు ధర లేదా అని వైఎస్ జగన్ వాకబు చేశారు. ఇంతవరకూ రైతుకు ఒక్క మేలు కూడా చేయలేదని చెప్పిన రైతులు. ఈ నేపథ్యంలో అధికారులతో మాట్లాడతానని, అవసరమైతే పోరాటం చేద్దామని వైఎస్ జగన్ వారి హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment