ఉత్సాహంగా ఆసరా సంబరాలు | Fourth installment of YSR Asara distribution | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా ఆసరా సంబరాలు

Published Sun, Jan 28 2024 4:13 AM | Last Updated on Sun, Jan 28 2024 5:38 PM

Fourth installment of YSR Asara distribution - Sakshi

సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు చెప్పినట్లుగానే 2019 ఏప్రిల్‌ 11వ తేదీ నాటికి మహిళల పొదుపు సంఘాల్లో వైఎస్సాఆర్‌ సీపీ ప్రభుత్వం నేరుగా నిధులు జమచేసింది. మహిళల పేరిట బ్యాంకుల్లో అప్పు మొత్తం రూ. 25,570.80 కోట్లను ఆసరా పథకంలో భాగంగా నాలుగు విడతల్లో అందజేశారు. దీంతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఔదార్యానికి పొదుపు సంఘాల మహిళలు నీరాజనాలు పలుకుతున్నారు.  

ఈ నెల 23 నుంచి నాలుగో విడత  ‘వైఎస్సార్‌ ఆసరా’ పంపిణీ కార్యక్రమం మొదలైంది. 2019 అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ నాటికి  ఎస్‌ఎల్‌బీసీ గణాంకాల ప్రకారం 78,94,169 మంది మహిళల పేరిట రూ. 25,570.80 కోట్లు పొదుపు సంఘాల రుణాలు ఉన్నాయి. దీంతో వైఎస్సాఆర్‌సీపీ ప్రభుత్వం 2020 సెపె్టంబరు 11న మొదట విడతగా రూ. 6,318.76 కోట్లు.. 2021 అక్టోబరు 7న రెండో విడతగా రూ.6,439.52 కోట్లు.. 2023 మార్చి 25న మూడో విడతగా రూ.6,417.69 కోట్లుచెల్లించింది.

ఇప్పుడు తాజాగా ఈ ఏడాది జనవరి 23 నుంచి నాలుగో విడత రూ. 6,394.83 కోట్లు మహిళల ఖాతాలో జమ చేస్తోంది. చంద్రబాబు రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పి, అధికారంలోకి వచ్చాక పైసా కూడా మాఫీ చేయకుండా మోసం చేయడంతో మహిళలు డీలా పడిపోయారు. ఈ పరిస్థితుల్లో పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీ మేరకు అమలు చేసి చూపిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి మహిళలు వివిధ రూపాల్లో తమ కృతజ్ఞలు చెబుతున్నారు.  

మండలాలు, మున్సిపల్‌ వార్డుల్లో సమావేశాలు  
పొదుపు సంఘాల మహిళలు సభలు నిర్వహించుకుని తమకు మంచి చేసే ఈ ప్రభుత్వానికే ఎప్పటికీ కృతజ్ఞలుగానే ఉంటామని ప్రతిజ్ఞలు చేస్తున్నారు. ఆసరా నాలుగో విడత పంపిణీని పండుగలా రెండు వారాల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో లబ్దిదారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. గత నాలుగు రోజుల్లో 62 మండలాలు, 18 మున్సిపాలిటీల పరిధిలో ఆయా స్థానిక ఎమ్మెల్యేలు ఆధ్వర్యంలో పొదుపు సంఘాల మహిళలతో సమావేశాలు జరిగాయి.

శనివారం 9 మండలాలు, నాలుగు మున్సిపాలిటీలలో ఆయా స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో పొదుపు సంఘాల మహిళా లబ్దిదారులతో కలిసి వైఎస్సార్‌ ఆసరా నాలుగో విడత సంబరాల్లో పాల్గొ­న్నారు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో డ్వాక్రా మహిళలకు రూ.14.57 కోట్ల విలువ చేసే ఆసరా నాలుగో విడత చెక్కు అందించడాన్ని పురస్కరించుకుని సీఎం వైఎస్‌ జగన్‌ చిత్రపటానికి మహిళలు క్షీరాభిషే­కం చేశారు. మాజీ మంత్రి బాలినేని శ్రీ,నివాసరెడ్డి, మంత్రి మేరుగు నాగా­ర్జున, జెడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జి బూచేపల్లి శివప్రసాదరెడ్డి పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement